AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ కేంద్రంగా నయా దందా.. శబరిమల పాసుల గోల్‌మాల్…భారీ సంఖ్యలో మోసపోయిన భక్తులు

అవకాశం లేనిచోటే ప్రజలను బురిడీ కొట్టించి నగదు నొక్కేస్తారు సైబుర్ కేటుగాళ్లు. ఇక అవకాశం చిక్కితే ఏ రేంజ్‌లో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా..?.

హైదరాబాద్ కేంద్రంగా నయా దందా.. శబరిమల పాసుల గోల్‌మాల్...భారీ సంఖ్యలో మోసపోయిన భక్తులు
Ram Naramaneni
|

Updated on: Dec 15, 2020 | 4:03 PM

Share

అవకాశం లేనిచోటే ప్రజలను బురిడీ కొట్టించి నగదు నొక్కేస్తారు సైబుర్ కేటుగాళ్లు. ఇక అవకాశం చిక్కితే ఏ రేంజ్‌లో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా..?. తాజాగా శబరిమల ఆన్‌లైన్ పాస్‌ల కొనుగోలు వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి..అందినకాడికి నగదు దోచుకున్నారు. భక్తులకు నకిలీ పాస్‌లు ఇచ్చి..కొత్త సమస్యల్లోకి నెట్టారు. ఈ దందా అంతా హైదరాబాద్ కేంద్రంగా జరగడం గమనార్హం.  దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి శబరిమలలో వర్చువల్ క్యూ విధానాన్ని అమలు చేస్తోన్నారు. అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్లదలిచిన భక్తులందరూ ఈ విధానంలోనే పాస్‌లను  కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి లక్షల్లో  భక్తులు శబరిమలకు తరలి వెళ్తుంటారు. అయితే  వర్చువల్ విధానంలో టికెట్ల బుకింగ్‌ను శబరిమల ఆలయం అధికారులు  పదిరోజుల కిందటే చేపట్టారు. మండలం-మకరవిళ్లక్కు సీజన్ కోసం 12 గంటల వ్యవధిలో 44 వేల పాసులను జారీ చేశారు. బుకింగ్‌ను నిలిపివేశారు కూడా. ఈ విషయం తెలియని భక్తులు.. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన వెబ్‌సైట్ల బారిన పడ్డారు.

హైదరాబాద్‌కు చెందిన కొందరు భక్తులు 1250 రూపాయలను చెల్లించి వర్చువల్ క్యూ పాస్‌లను కొనుగోలు చేశారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని..కాస్త ఎక్కువ డబ్బు చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు ఆ భక్తులకు ఫోన్ చేశారు. మరో 2,750 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. నకిలీ వెబ్‌సైట్ల బారిన పడిన కొందరు భక్తులు స్వామివారి శబరిమల వరకూ వెళ్లి.. దర్శనం కాకుండానే వెనక్కి రావాల్సి వచ్చింది.  వారు చూపించిన పాసులు చెల్లవని, అవి నకిలీవని నీలక్కల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Also Read :

ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?

55 అడుగుల కొబ్బరి చెట్టుపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి..స్థానికులు సమాచారంతో స్పాట్‌కు పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే