రేపే మిలియన్ మార్చ్..! ఏం జరుగుతుందో..?

గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో ఆర్టీసీపై జరుగుతోన్న రచ్చ తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె.. 35వ రోజుకి చేరుకుంది. డిపోల వద్ద కార్మికులు ఆందోళనకు దిగగా.. వారికి విపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకూ.. సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేసేది కుదరదని.. సీఎం కేసీఆర్ ఫైనల్‌గా చెప్పేశారు. దీంతో.. కొంతమంది విధుల్లో చేరారు. మిగతావారు ఆర్టీసీ […]

రేపే మిలియన్ మార్చ్..! ఏం జరుగుతుందో..?
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 08, 2019 | 1:28 PM

గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో ఆర్టీసీపై జరుగుతోన్న రచ్చ తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె.. 35వ రోజుకి చేరుకుంది. డిపోల వద్ద కార్మికులు ఆందోళనకు దిగగా.. వారికి విపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకూ.. సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేసేది కుదరదని.. సీఎం కేసీఆర్ ఫైనల్‌గా చెప్పేశారు. దీంతో.. కొంతమంది విధుల్లో చేరారు. మిగతావారు ఆర్టీసీ స్ట్రైక్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.. అశ్వత్థామ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధ‌ృతం చేసే దిశగా.. ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్టు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు.

ఆర్టీసీ జేఏసీ రేపటి ఛలో ట్యాంక్‌బండ్‌ను.. మరో మిలియన్‌ మార్చ్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అఖిలపక్షం నేతలు మద్దతు పలికారు. కార్మికులు కుటుంబ సభ్యులతోపాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజాసంఘాలను పెద్ద ఎత్తున ఛలో ట్యాంక్‌బ్యాండ్‌కు తరలించేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనేలా ఆర్టీసీ జేఏసీ నేతలు వారితో చర్చలు జరుపుతున్నారు. అసలే ఆర్టీసీ కార్మికులపై మండిపడుతోన్న తెలంగాణ ప్రభుత్వం.. రేపు మిలియన్‌ మార్చ్‌పై ఎలా స్పందిస్తుందో.. చూడాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu