ఆ హై‌టెక్‌ దొంగలు ఏం ఎత్తుకెళ్లారో తెలుసా… ఏకంగా..

హైదరాబాద్ : ఇప్పటి వరకు బైకులు, కారులు, ఇంకా కాదంటే ట్రక్కులను దొంగతనం చేసిన వార్తలే చూశాం. కానీ ఈ సారి ఓ హైటెక్ దొంగల ముఠా ఏకంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్‌లోని సీబీఎస్ బస్టాండ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 23న రాత్రి 11.00 గంటలకు సీబీఎస్‌లో డ్రైవర్ బస్సును నిలిపి వెళ్లాడు. తెల్లవారిన తరువాత వచ్చి చూస్తే బస్సు కనిపించలేదు. దీంతో అఫ్జల్ గంజ్ […]

ఆ హై‌టెక్‌ దొంగలు ఏం ఎత్తుకెళ్లారో తెలుసా... ఏకంగా..
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 9:32 AM

హైదరాబాద్ : ఇప్పటి వరకు బైకులు, కారులు, ఇంకా కాదంటే ట్రక్కులను దొంగతనం చేసిన వార్తలే చూశాం. కానీ ఈ సారి ఓ హైటెక్ దొంగల ముఠా ఏకంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్‌లోని సీబీఎస్ బస్టాండ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 23న రాత్రి 11.00 గంటలకు సీబీఎస్‌లో డ్రైవర్ బస్సును నిలిపి వెళ్లాడు. తెల్లవారిన తరువాత వచ్చి చూస్తే బస్సు కనిపించలేదు. దీంతో అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆర్టీసీ కంట్రోలర్ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం వల్లే బస్సు చోరీకి గురైందనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తుప్రాన్ గేట్ వద్ద నుంచి.. బస్సు నాందేడ్ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.