AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR in AP Politics: ‘తూర్పు’ రాజకీయాల్లో ట్రిపుల్ ‘ఆర్’ .. పరిష్కారం సాధ్యమా?

త్రిబుల్‌ ఆర్‌. ఇప్పుడు ఆ జిల్లాలో హాట్‌ టాపిక్‌. ఆర్‌ లెటర్‌తో స్టార్ట్‌ అయ్యే ఆ నియోజకవర్గాలు ఇప్పుడు గ్రూప్‌వార్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా పాలిటిక్స్‌లో #RRR కలకలం రేపుతోంది.

RRR in AP Politics: ‘తూర్పు’ రాజకీయాల్లో ట్రిపుల్ ‘ఆర్’ .. పరిష్కారం సాధ్యమా?
Rajesh Sharma
|

Updated on: Feb 29, 2020 | 10:41 AM

Share

YCP facing RRR problem in East Godavari district: త్రిబుల్‌ ఆర్‌. ఇప్పుడు ఆ జిల్లాలో హాట్‌ టాపిక్‌. ఆర్‌ లెటర్‌తో స్టార్ట్‌ అయ్యే ఆ నియోజకవర్గాలు ఇప్పుడు గ్రూప్‌వార్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యాయి. కొత్త నేతల రాకతో పాత నేతలు అలర్ట్‌ అయ్యారు. తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని తెగ మధనపడుతున్నారు. ఇంతకీ మూడు నియోజకవర్గాల్లో రాజకీయ వేడికి కారణాలేంటి?

రాజమహేంద్రవరం.. రాజోలు .. రామచంద్రపురం.. #RRR ఈ మూడు త్రిబుల్‌ ఆర్‌ నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాలో హాట్‌ టాపిక్‌‌గా మారాయి. స్థానిక ఎన్నికలు త్వరలో జరుగుతాయనే ప్రచారంతో గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి. ఇటీవల రామచంద్రపురం నియోజకవర్గంలో టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే చెల్లబోయిన వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వర్గాల మధ్య గొడవతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఈ వర్గపోరుతో నియోజకవర్గంలో టెన్షన్ మొదలైంది.

బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వేణుకు రామచంద్రపురం టికెట్‌ ఇచ్చారు. ఆయన గెలిచిన తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే త్రిమూర్తులు రాకతో వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్‌ ఆయనకు వెళుతుందని అనే భయం వేణు వర్గంలో ఉంది. ఒక వేళ సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి పదవి పోయి..ఆయనకు వేరే పదవి ఇవ్వకపోతే జిల్లాలో బీసీ వర్గం పార్టీకి దూరమయ్యే సూచనలు ఉన్నాయనేది వైసీపీలోని ఓవర్గం భయం.

రాజోలు వైసీపీలో గ్రూప్‌ కూడా వార్‌ ముదిరింది. ఇక్కడ అధికారపార్టీకి ఎమ్మెల్యే లేరు. 2014 నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు ప్రాధాన్యత తగ్గింది. ఇక్కడ ఇంచార్జ్‌గా తునికి చెందిన పెదపాటి అమ్మాజీని నియమించారు. దీంతో ఇరువర్గాల మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి. ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆయన వస్తే మూడు గ్రూపులు తయారయ్యే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌, సిటీ కోఆర్డినేటర్‌ శివరామసుబ్రహ్మణ్యంకు అసలు పడడం లేదని చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్‌ సీటు కైవసం చేసుకోవాలని శివ ప్రయత్నాలు చేస్తుంటే..ఎంపీ సొంతవర్గంతో ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని ఆయన వర్గం వాదిస్తోంది. ప్రస్తుతం పార్టీలో అన్ని వర్గాలు సైలెంట్‌గా ఉన్నాయి. కానీ కార్పొరేషన్ ఎన్నికల టైమ్‌కు వర్గపోరు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు మిగతా నియోజకవర్గాల్లో కూడా గ్రూప్‌ వార్‌ ముదురుతోంది. పెద్దాపురం నుంచి పోటీ చేసిన తోటవాణిని పక్కనపెట్టి…దవులూరి బాబ్జీకి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ప్రత్తిపాడులో ఎమ్మెల్యే పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వరుపుల మధ్య విభేదాలు ఉన్నాయి. మొత్తానికి తూర్పు వైసీపీలో గ్రూప్‌ వార్‌ మొదలైంది. స్థానిక ఎన్నికల సమయానికి ఈ వార్‌ ముదిరి…పార్టీకి ఇబ్బందులు తెస్తుందని కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారు. మరీ పార్టీ పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

ఇదీ చదవండి: అధినేత వచ్చినా ఆయన రాలేదు.. కథ కంచికేనా? Ganta not appeared in Chandrababu’s Vizag hulchal