బెజవాడలో ఇద్దరు రౌడీ షీటర్లు అరెస్ట్, మారణాయుధాలు స్వాధీనం
ఇటీవల గ్యాంగ్ వార్‌లు కలకలం రేపిన నేపథ్యంలో విజయవాడ పోలీసులు అలెర్టయ్యారు. ఓవర్ చేసే రౌడీ షీటర్ల తాట తీస్తున్నారు.
ఇటీవల గ్యాంగ్ వార్‌లు కలకలం రేపిన నేపథ్యంలో విజయవాడ పోలీసులు అలెర్టయ్యారు. ఓవర్ చేసే రౌడీ షీటర్ల తాట తీస్తున్నారు. పీడీ యాక్టులు పెట్టడంతో పాటు అవసరమైతే నగర బహిష్కరణకు కూడా వెనకాడటం లేదు. తాజాగా విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో విజయవాడ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెనమలూరు పీఎస్ పరిధి, కానూరు గ్రామానికి చెందిన రౌడీ షీటర్ కొక్కిలిగడ్డ జాన్ బాబు (45) ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు కోనా నాగేశ్వరరావు కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 గొడళ్లు, 2తల్వార్లు , 3 డమ్మీ తుపాకులు, 1 బంగారం రంగు కల్గిన కత్తి, 1 ఎయిర్ పిస్టల్, 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కొక్కిలిగడ్డ జాన్ బాబుపై విజయవాడ సిటీలో 30 కేసులు, హైదరాబాద్‌లో ఒక కిరాయి హత్య కేసు మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. వాటిలో విజయవాడ సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 2 మర్డర్ కేసులు , 10 హత్యా యత్నం కేసులు , 18 దొమ్మి కేసులు ఉన్నాయి. కోన నాగేశ్వరరావుతో కలసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక ప్రైవేటు ల్యాండ్ సెటిల్‌మెంట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు