రజనీకాంత్‌తో ఢీ అంటే ఢీ అంటున్న రోజా భర్త.. వాలీడ్ రీజనే సుమా!

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సమరానికి దిగారు. రోజా భర్తకు రజనీకాంత్‌కు లింకేంటన్న అనుమానం కలిగినా ఇది నిజం. రజనీకాంత్ వైఖరిపై మండిపడుతున్న రోజా భర్త.. సూపర్ స్టార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రజనీకాంత్‌పై బహిరంగ విమర్శలకు దిగుతున్న రోజా భర్త ఇప్పుడు కోలీవుడ్‌లో వివాదానికి కేంద్రబిందువయ్యారు. రోజా భర్త తమిళ సినీ దర్శకుడు సెల్వమణి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. గత కొంత కాలంగా సెల్వమణికి సినిమాలు పెద్దగా లేవు. […]

రజనీకాంత్‌తో ఢీ అంటే ఢీ అంటున్న రోజా భర్త.. వాలీడ్ రీజనే సుమా!
Follow us

|

Updated on: Feb 11, 2020 | 6:29 PM

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సమరానికి దిగారు. రోజా భర్తకు రజనీకాంత్‌కు లింకేంటన్న అనుమానం కలిగినా ఇది నిజం. రజనీకాంత్ వైఖరిపై మండిపడుతున్న రోజా భర్త.. సూపర్ స్టార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రజనీకాంత్‌పై బహిరంగ విమర్శలకు దిగుతున్న రోజా భర్త ఇప్పుడు కోలీవుడ్‌లో వివాదానికి కేంద్రబిందువయ్యారు.

రోజా భర్త తమిళ సినీ దర్శకుడు సెల్వమణి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. గత కొంత కాలంగా సెల్వమణికి సినిమాలు పెద్దగా లేవు. దాంతో రాజకీయాల్లో రోజాకు చేదోడుగా వుంటూనే తమిళ దర్శకుల సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు దర్శకత్వం నెరపిన సెల్వమణికి ఇప్పటికీ సినిమా పరంగా ఫాలోయింగ్‌ బాగానే ఉంది. కానీ ఆయన ఇటీవల చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. తమిళ సినీ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

తమిళనాట ఇప్పుడు అసలు సినిమాలు ఆడకపోవడానికి ఏవరు అనే అంశంపై చర్చ మొదలైంది. సినిమాకు హైప్ వచ్చేలా చేసే హీరోలా? లేక అంఛనాలకు అనుగుణంగా సినిమాను తీయలేకపోయిన దర్శకులా? ఈ చర్చకు తెరలేపింది సెల్వమణి వ్యాఖ్యలే.

రజనీకాంత్‌ హీరోగా మురుగదాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా దర్బార్‌. ఈ సినిమాపై తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. కొందరు రజనీకాంత్‌ టార్గెట్‌ చేస్తే…మరికొందరు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. మొత్తానికి దర్బార్‌ సినిమాపై తమిళ సినీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది.

దర్బార్‌ మూవీ నష్టాలతో కొందరు బయ్యర్లు ఉద్యమ బాట పట్టారు. దర్బార్‌ సినిమా కొనుగోలు చేయడం వల్ల సుమారు 50 కోట్లకు పైగా నష్టపోయామని…తమకు న్యాయం చేయాలని ఇటీవల రజనీకాంత్‌ ఇంటిని ముట్టడించేందుకు బయ్యర్లు ప్రయత్నించారు. నిర్మాణ సంస్థ పట్టించుకోకపోవడంతో హీరో రజనీకాంత్‌, డైరెక్టర్‌ మురుగదాస్‌ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అయితే ఇప్పటివరకూ ఈ కహానీలో పెద్ద ట్విస్ట్‌లు ఏం లేవు. కానీ నగరి ఎమ్మెల్యే రోజా భర్త, తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు సెల్వమణి చేసిన కామెంట్స్‌పై రజనీకాంత్‌ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా వల్ల కలిగే నష్టానికి నిర్మాతలు బాధ్యత తీసుకోవాలని…. దర్శకుల్ని బాధ్యులను చేయడం సరికాదని సెల్వమణి వ్యాఖ్యానించారు. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి హీరో రజనీకాంత్‌ కారణమని సెల్వమణి విమర్శలు గుప్పించారు.

గతంలో సినిమా కొని నష్టపోయిన వాళ్లకి తిరిగి డబ్బులు ఇచ్చే సంప్రదాయాన్ని రజనీకాంత్‌ తీసుకొచ్చారని…దాని వల్లే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందని అన్నారాయన. సినిమా ఆడకపోయినా ప్రతిసారి ఈ సమస్య రావడానికి రజనీ కారణమని దుమ్మెత్తిపోశారు. ఆయనకు ఇవ్వాలనిపిస్తే తిరిగి ఇవ్వొచ్చని… ఇందులోకి దర్శకులు లాగడం సరికాదు అనేది సెల్వమణి పాయింట్‌. అయితే ఈ కామెంట్స్‌పై రజనీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. దర్శకుడు మురుగదాస్‌ వల్లే సినిమాకు ఈ పరిస్థితి వచ్చిందని…సినిమా ఆడకపోవడానికి డైరెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ఇన్‌డైరెక్టుగా సెల్వకు చురకలు వేస్తున్నారు. సెల్వమణి రజనీకాంత్‌పై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.