గుంటూరు జిల్లాలో భారీ చోరీ, ఫ్యామిలీ గుడికి వెళ్లిన సమయంలో చాకచక్యంగా దోపిడీ, భారీగా బంగారు నగల అపహరణ
గుంటూరు జిల్లా తాడేపల్లిలో భారీ చోరీ జరిగింది. బైపాస్ ఆశ్రమం రోడ్డు దగ్గర ఉన్న అపూర్వ అపార్ట్ మెంట్లోకి చొరబడ్డ దుండగులు భారీ..
గుంటూరు జిల్లా తాడేపల్లిలో భారీ చోరీ జరిగింది. బైపాస్ ఆశ్రమం రోడ్డు దగ్గర ఉన్న అపూర్వ అపార్ట్ మెంట్లోకి చొరబడ్డ దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు 10 లక్షల విలువైన బంగారం ఆభరణాలు అపహరించారు. రిటైర్మెంట్ ఉద్యోగి సత్యనారాయణ తన కుటుంబంతో నూతన సంవత్సరం సందర్బంగా గుడికి వెళ్ళిన సమయంలో చోరి జరిగింది. దొంగలు చాకచక్యంగా ఇంటిలోకి చొరబడి బీరువా పగులగొట్టి సుమారు 200 గ్రాములు పైన బంగారం ఆభరణాలు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.