AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం..! ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినేయండి..

మనలో చాలామందికి బీరకాయ పేరు వినగానే ముఖం చిట్లించడం అలవాటు. అయితే ఇది కేవలం ఒక సాధారణ కూరగాయ మాత్రమే కాదు, పోషకాల గని. బీరకాయలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, విటమిన్లు, నీటి శాతం, సమృద్ధిగా ఫైబర్ ఉంటాయి. వారానికి కనీసం రెండుసార్లు బీరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా అనేక తీవ్రమైన రోగాల నుండి రక్షణ లభిస్తుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం..! ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినేయండి..
Ridge GourdImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2026 | 2:08 PM

Share

బీరకాయ సాధారణంగా అందరి ఇళ్లలో చేసుకునే కూరగాయే అయినా, దీనిలోని విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియవు. బీరకాయలో ఫైబర్, విటమిన్ సీ, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, నీటి శాతం సమృద్ధిగా ఉంటాయి. బీరకాయలో ఫైబర్, నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా అరికడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.

బీరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు దీనిని ధైర్యంగా తినవచ్చు. ఇది సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేసి కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే, ఇందులో ఉన్న యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, నీటి శాతం కిడ్నీల వడబోత ప్రక్రియను మెరుగుపరిచి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీరకాయలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి ఆకలి తగ్గుతుంది. ఇది క్రొవ్వు పేరుకుపోకుండా చేసి బరువును అదుపులో ఉంచుతుంది.

ఇందులోని మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటు, పెరగకుండా నివారించి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. బీరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కీళ్ల వాపులు, మంటలతో బాధపడేవారికి కూడా ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజు నుండే బీరకాయను మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోండి!

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!