ఇంగ్లీష్ రాని షేక్.. ఏం చేశాడంటే.?

ఇంగ్లీష్ రాని షేక్.. ఏం చేశాడంటే.?

ఇంగ్లీష్ భాష రాకపోవడంతో ఓ ధనవంతుడు చిక్కుల్లో పడ్డాడు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ వింత సంఘటన వల్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యానికి గురైయ్యారు. సౌదీలోని ఓ కుబేరుడికి తన కొడుకంటే అమితమైన ఇష్టం. కొడుకు పుట్టినరోజు నాడు నిజమైన విమానాల మాదిరి ఉండే బొమ్మ విమానం(స్కేల్ మోడల్స్) గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఇందుకోసం ఎయిర్ బస్ కంపెనీకి ఫోన్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఆ కుబేరుడికి ఓ […]

Ravi Kiran

| Edited By: Srinu Perla

Aug 28, 2019 | 4:33 PM

ఇంగ్లీష్ భాష రాకపోవడంతో ఓ ధనవంతుడు చిక్కుల్లో పడ్డాడు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ వింత సంఘటన వల్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యానికి గురైయ్యారు. సౌదీలోని ఓ కుబేరుడికి తన కొడుకంటే అమితమైన ఇష్టం. కొడుకు పుట్టినరోజు నాడు నిజమైన విమానాల మాదిరి ఉండే బొమ్మ విమానం(స్కేల్ మోడల్స్) గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఇందుకోసం ఎయిర్ బస్ కంపెనీకి ఫోన్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఆ కుబేరుడికి ఓ చిక్కొచ్చి పడింది.

అతడు వచ్చీ రాని ఇంగ్లీష్‌తో అక్కడి ఉద్యోగులను గందరగోళానికి గురి చేసి.. ఏకంగా నిజమైన విమానాలకు ఆర్డర్ ఇచ్చాడు. పాపం అదేమో ఆ సౌదీ ధనవంతుడికి తెలియలేదు. వాళ్ళు రెండు విమానాలకు 329 మిలియన్ యూరోలు(దాదాపు రూ. 2,600 కోట్లు) ఖర్చువుతుందని చెప్పగా.. మొదట అనుమానం వచ్చినా.. అందమైన విమానాలు తయారు చేయడానికి ఇంత అవుతుందేమోనని ఆ మొత్తాన్ని కట్టేశాడు.

ఆ తర్వాత కొన్ని నెలలకు ఎయిర్ బస్ వారు ఫోన్ చేశారు. రెండు ఎ350-1000 విమానాలు డెలివరీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. విమానాల్ని నడపటానికి ఎవర్ని పంపిస్తున్నారంటూ ఒక్క ప్రశ్న అడగ్గా.. అప్పుడు తట్టింది సౌదీ ఆసామి చిన్న బుర్రకు అసలు మ్యాటర్. చివరికి ఓ చిన్న స్మైల్ ఇచ్చి, చాలా కూల్‌గా విమానాల డెలివరీ తీసుకున్నాడు. ఇక వచ్చిన ఆ విమానాల్లో  ఒకదాన్ని కొడుకు బహుమతిగా ఇచ్చి.. మరొకటి బందువుకు ఇచ్చాడు. ‘వాళ్ళు నన్ను చాలా ప్రశ్నలు అడిగినా.. ఆ తయారు చేసే విమానాలు అచ్చం ఒరిజినల్ వాటిలా ఉంటాయనుకున్నాను అని తాపీగా జవాబిచ్చాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu