బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఎన్సీబీ అధికారులు ఇప్పటికే నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్తవర్తి, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిండా, సుశాంత్ కుక్(వంట మనిషి) దీపేష్ శావంత్‌తో పాటు డ్రగ్ డీలర్ కైజన్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో రియా పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో.. ఎన్సీబీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఏ క్షణంలోనైనా రియా చక్రవర్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.(Rhea Chakraborty Ready For Arrest)
ఇదిలా ఉంటే విచారణ సమయంలో రియా చక్రవర్తి కన్నీటి పర్యంతం అయినట్లు తెలుస్తోంది. “రియా చక్రవర్తి అరెస్టుకు సిద్ధంగా ఉంది. ఒకరిని ప్రేమించడం నేరం అయితే.. ఆ ప్రేమ కోసం దేనినైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉంది. ఇప్పటివరకు ఆమె ఎలాంటి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదని” రియా తరపు న్యాయవాది సతీష్ మనేషిందే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, సుశాంత్ కేసులో మొదటి నుంచి రియాపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.