Breaking: సుశాంత్ కేసు.. 4 రోజుల కస్టడీలోకి షోవిక్ చక్రవర్తి..

సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముంబై హైకోర్టు అనుమతుల మేరకు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరిండాను నార్కోటిక్స్ బృందం కస్టడీలోకి తీసుకోనుంది.

Breaking: సుశాంత్ కేసు.. 4 రోజుల కస్టడీలోకి షోవిక్ చక్రవర్తి..
Follow us

|

Updated on: Sep 05, 2020 | 3:25 PM

Showik, Samuel Sent to NCB Custody: సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముంబై హైకోర్టు అనుమతుల మేరకు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరిండాను నార్కోటిక్స్ బృందం కస్టడీలోకి తీసుకోనుంది. వీరిద్దరికి నాలుగు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. అలాగే డ్రగ్ డీలర్ కైజన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను హైకోర్టు విధించింది.

కాగా, సుశాంత్ కేసులో డ్రగ్స్ లింక్ ఉన్న నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అఫ్ ఇండియా రంగంలోకి దిగింది. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఎన్సీబీ నిర్ధారించింది. దీనితో షోవిక్‌, శ్యామూల్ మిరిండాలను అరెస్ట్ చేసి ఎన్సీబీ విచారణ చేయగా.. పలు సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

డ్రగ్స్ వ్యాపారులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. అలాగే సుశాంత్‌కు కూడా షోవిక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారించడమే కాకుండా.. రియా చక్రవర్తి కోరడంతోనే అతడు ఈ పని చేసినట్లు ఎన్సీబీ గుర్తించింది. దీంతో రియాను విచారించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. అంతేకాదు ఆమె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కాగా, ఈ కేసు విషయంలో ప్రశ్నించాల్సిన ఉన్న వారందరికీ కూడా సమన్లు పంపిస్తామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..