కశ్మీర్‌లో సాధారణ పౌరజీవనం యధావిధిగా రోడ్లపైకి వచ్చి దినచర్యలను కొనసాగించారు. శుక్రవారం మసీదుల్లో జరిగిన ప్రార్ధనలకు యధావిధిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈద్ పండుగ సందర్భంగా శుక్రవారం జరిగే ప్రార్థనలకు, వ్యాపారాలకు ఆటంకం కలగకుండా ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈద్ పండుగను జమ్ము ప్రజలు సంతోషంతో చేసుకుంటారని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని గురువారం రాత్రి ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ ప్రజలకు సందేశాన్నిచ్చారు. త్వరలోనే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కూడా ప్రధాని విశ్వాసం వ్యక్తం చేసారు.
మరోవైపు శ్రీనగర్‌లోని చారిత్రాత్మక జామా మసీదులో ప్రార్థనలకు ఆంక్షలు సడలించారు. కూరగాయలు, మెడికల్ షాపులు తెరుచుకున్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలు కూడా కొద్దిగా జరిగాయి. మరోవైపు మార్కెట్లు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచే ఉంటాయని, కశ్మీర్‌లో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు.