జమ్ము కశ్మీర్‌లో 4జీ ఇంటర్‌నెట్..

|

Aug 12, 2020 | 2:05 PM

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితితులు ఒక్కటొక్కటిగా చక్కబడుతున్నాయి. దీంతో అక్కడి ఆంక్షలను నెమ్మదిగా తొలిగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్నెట్‌ సేవల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. తొలి దశలో...

జమ్ము కశ్మీర్‌లో 4జీ ఇంటర్‌నెట్..
Follow us on

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితితులు ఒక్కటొక్కటిగా చక్కబడుతున్నాయి. దీంతో అక్కడి ఆంక్షలను నెమ్మదిగా తొలిగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్నెట్‌ సేవల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. తొలి దశలో ఆగస్టు 15 తరువాత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల 4జీ ఇంటర్నెట్‌ సేవలు అందించనున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని బెంచ్‌ ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ జమ్మూకశ్మీర్‌లోని ఒక్కో జిల్లాలో ప్రయోగాత్మకంగా 4జీ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించి, రెండు నెలల తరువాత సమీక్షించాలని కమిటీ నిర్ణయించిందని కోర్టుకు తెలిపారు. ఆ తరువాత దశలవారీగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయిలతో కూడిన బెంచ్‌ స్పందిస్తూ.. కేంద్రం నిర్ణయం సమంజసంగానే కనిపిస్తోందని అన్నారు.