రైల్వే సంస్థలో 53 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక

| Edited By:

Oct 20, 2019 | 2:20 PM

భారతీయ రైల్వే‌కు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (RCIL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ రైల్వేస్‌కు అనుబంధ సంస్థ అయిన RCIL.. బ్రాడ్ బ్యాండ్, టెలికామ్, ట్రైన్ కంట్రోల్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ లాంటి సేవల్ని అందిస్తుంది. తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 53 ఖాళీలున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు […]

రైల్వే సంస్థలో 53 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
Follow us on

భారతీయ రైల్వే‌కు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (RCIL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ రైల్వేస్‌కు అనుబంధ సంస్థ అయిన RCIL.. బ్రాడ్ బ్యాండ్, టెలికామ్, ట్రైన్ కంట్రోల్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ లాంటి సేవల్ని అందిస్తుంది. తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 53 ఖాళీలున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

RCIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు

1. మొత్తం ఖాళీలు- 53
2. గ్రాడ్యుయేట్ ఇంజనీర్- 27
3. టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్)- 26
4. దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25
5. వేతనం- గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌కు రూ.14,000, టెక్నీషియన్‌కు రూ.12,000.
6. విద్యార్హత- గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌ పోస్టుకు 4 ఏళ్ల ఫుల్ టైమ్ డిగ్రీ. టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుకు డిప్లొమా తప్పనిసరి.
7. వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.