RBI CTS: కొత్త చెక్కు విధానంపై ఆర్బీఐ కీలక ఆదేశాలు.. అన్ని బ్యాంకులలో సెప్టెంబర్ 30లోపు కొత్త చెక్ వ్యవస్థ
RBI CTS: దేశ వ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేన్ విధానాన్ని విస్తరించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ విధానం ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో మాత్రమే అమల్లో ఉంది. దీనిని అన్ని బ్యాంకుల..
RBI CTS: దేశ వ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేన్ విధానాన్ని విస్తరించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ విధానం ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో మాత్రమే అమల్లో ఉంది. దీనిని అన్ని బ్యాంకుల శాఖలకు సెప్టెంబర్ 30 నాటికి విస్తరించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఇమేజ్ బేస్ట్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను అన్ని శాఖలకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు విస్తరించేలా చర్యలు చేపట్టాలని ఆర్బీఐ పేర్కొంది. సీటీఎస్ విధానం సమగ్రంగా అందుబాటులో ఉండాలని, కస్టమర్ ఉండే చోటుతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా సేవలు అందాలని పేర్కొంది. దేశంలోని అన్ని బ్యాంకుల శాఖలన్నింటికీ సీటీఎస్ విధానాన్ని విస్తరించాలని సూచించింది.
సీటీఎస్ అంటే ఏమిటీ..?
చెక్‌ణు జారీ చేసినప్పటి నుంచి నగదు చెల్లింపు జరిగే వరకు బ్యాంకు శాఖల మధ్య భౌతికంగా ఆ చెక్కు తిరగవలసిన అవసరం లేకుండా చేయడమే సీటీఎస్ విధానం. ఇదిలా ఉండగా, సీటీఎస్ విధానం 2010 నుంచే అమల్లో ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలోని బ్యాంకుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా ప్రాంతాల్లో అందుబాటులో లేదు. బ్యాంకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకువస్తుంది.
అయితే ఈ విధానం వల్ల చెక్కును జారీ చేసినప్పటి నుంచి నగదు చెల్లింపు జరిగే వరకు బ్యాంకు శాఖల మధ్య భౌతికంగా ఆ చెక్కు తిరుగవలసిన అవసరం లేకుండా చేయడమే సీటీఎస్ విధానం ఉద్దేశం. అలాగే బ్యాంకు వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలను వేగంగా అందించే లక్ష్యంలో భాగంగా కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నది.
ఈ విధానం బ్యాంకు స్థానంతో ఎలాంటి సంబంధం లేకుండా ఏకరీతి కస్టమర్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడానికి దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో సీటీఎస్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రతి శాఖలో తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేడయం, లేదా హబ్, స్పాక్ మోడల్‌ను అనుసరించడం వంటి వాటి వల్ల వినియోగదారులు తమకు నచ్చిన నమూనాను స్వీకరించడానికి స్వేచ్ఛగా ఉంటారు అని తెలిపింది. సీటీఎస్ యొక్క పాన్-ఇండియా కవరేజ్ సాధించడానికి రోడ్ మ్యాప్ గురించి తెలియజేయడానికి 2021 ఏప్రిల్ 30లోపు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. అయితే 2010 నుంచే ఈ సీటీఎస్ విధానం వాడుకలో ఉంది. ప్రస్తుతం 1,50,000 శాఖల్లో ఈ విధానం అందుబాటులో ఉంది.
ఇవీ చదవండి : Amazon Kids Carnival: అమెజాన్ బంపర్ ఆఫర్.. ప్రత్యేక ఆఫర్లతో కిడ్స్ కార్నివాల్ సేల్ ప్రారంభం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండగకు ముందే కీలక ప్రకటన..!