అద్భుతమైన ఘట్టం.. రాముడి గుడికి భూమి పూజ చేసిన ప్రధాని

అద్భుతమైన ఘట్టం.. రాముడి గుడికి భూమి పూజ చేసిన ప్రధాని

అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో శిలాపూజ, భూమిపూజ, కర్మ శిలాపూజల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. భూమి పూజలో భాగంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీ రామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంలోనే భూమి పూజ...

Sanjay Kasula

|

Aug 05, 2020 | 4:22 PM

ram temple In historic ayodhya ceremony : కోట్లమంది కల నెరవేరింది. అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. ఆసేతు హిమాచలం.. రామనామస్మరణతో మార్మోగింది. ఏటా శ్రీరామనవమి నాడు మార్మోగే జైశ్రీరామ్‌ నినాదాలు.. అభిజిత్‌ లగ్నం శుభ ముహూర్తాన మరోసారి వినిపించాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు ప్రధాని మోదీ చేతులమీదుగా రామనామస్మరణతో శంకుస్థాపన పూజ జరిగింది. కోట్లమంది కళ్లు ఒక్కటై.. అయోధ్య భూమిపూజను కళ్లారా తిలకించాయి. మదిమదిలో రామమందిరం అనేలా.. సాగిన ఈ వేడుక కన్నులపండువగా సాగింది.

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరిగిన భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని ఇక్కడికి తీసుకొచ్చారు. 1989లో రామ మందిరం నిర్మాణం కోసం సుమారు 2.75 లక్షల ఇటుకలను రామ భక్తులు అయోధ్యకు పంపించారు. ఇందులో ‘జై శ్రీరామ్‌’ అక్షరాలు ఉన్న వంద ఇటుకలను భూమిపూజ, అనంతర నిర్మాణ పనుల కోసం వినియోగిస్తారని పూజారులు తెలిపారు.

ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు మోడీ భార‌తీయ వేష‌ధార‌ణ‌లో ప్రత్యేక ఆకర్షణనలో నిలిచారు. మోడీ ధోతి కుర్తాను ధ‌రించారు. సిల్వర్‌ కలర్‌ ధోతీ, కాషాయరంగు కుర్తాలో భార‌తీయ పురాత‌న వ‌స్త్ర అలంక‌ర‌ణ‌ల‌లో మెరిశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu