AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ ప్రముఖులపై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్…!

బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలను ప్రసారం చేశాయంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో బీ-టౌన్‌కు చెందిన...

బాలీవుడ్ ప్రముఖులపై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్...!
Ravi Kiran
|

Updated on: Oct 13, 2020 | 3:48 PM

Share

Ram Gopal Varma Satirical Tweet: బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతిష్టకు భంగం కలిగించేలా, అనైతికంగా తప్పుడు కథనాలను ప్రసారం చేశాయంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రోడ్యూసర్ గిల్డ్, సినీ అండ్ టీవి ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఇతర 34 ప్రొడక్షన్ సంస్థలు కలిసి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అందులో రిపబ్లిక్ టీవీకి చెందిన అర్నబ్ గోస్వామి, ప్రదీప్ భండారి.. టైమ్స్ నౌ‌కు చెందిన రాహుల్ శివశంకర్, నవికా కుమార్ పేర్లను పేర్కొన్నాయి. దీనిపై తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.

”బాలీవుడ్ పెద్దల రియాక్షన్ చాలా లేట్‌గా, ఇంకా చల్లగా ఉంది. బాలీవుడ్ స్టార్లందరూ కూడా ”స్కూల్ పిల్లల్లా టీచర్ వద్దకు వెళ్లి.. టీచర్.. టీచర్ అర్నబ్ మమ్మల్ని తిడుతున్నాడు’ అన్నట్లు ఢిల్లీ హైకోర్టు ముందుకు వెళ్లారని రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  మరణం తర్వాత ఒక్కసారిగా బీ-టౌన్ ప్రముఖులపై జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి వరుసగా ఘాటైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. సుశాంత్ కేసు, డ్రగ్స్ ఇష్యూ, లైంగిక వేధింపులు మొదలైన వాటిపై పలు డిబేట్లు పెట్టారు. అంతేకాకుండా సుశాంత్ కేసులో రోజుకో కొత్త అప్డేట్‌ను బయటపెడుతూ వచ్చారు. అయితే ఇటీవల ఎయిమ్స్ బృందం సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని రిపోర్ట్ ఇవ్వడం.. అంతేకాకుండా రియా చక్రవర్తికి బెయిల్ రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ప్రముఖులు.. ఇండస్ట్రీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అసత్య కథనాలు ప్రసారం చేశాయంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ సంస్థలపై దావా వేశారు.

Follow Us