AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

పిల్లలకు ఆరు నెలలు దాటగానే చాలామంది తల్లిదండ్రులకు వచ్చే పెద్ద సందేహం.. ఆవు పాలు పట్టాలా? లేక గేదె పాలు పట్టాలా? అని.. పొరపాటున తప్పుడు పాలు ఎంచుకుంటే అది చిన్న పిల్లల సున్నితమైన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసలు చిన్న పిల్లలకు ఏ పాలు అత్యంత మంచివి..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనేది తెలుసుకుందాం..

ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
Cow Milk Vs Buffalo Milk For Babies
Krishna S
|

Updated on: Jul 24, 2026 | 8:58 PM

Share

పిల్లలు పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు స్పష్టంగా చెబుతుంటారు. అయితే ఆరు నెలలు దాటిన తర్వాత లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిపాలు సరిపోనప్పుడు పిల్లలకు బయటి పాలు పట్టాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో దాదాపు అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.. పిల్లలకు ఆవు పాలు మంచివా? లేక గేదె పాలు పడితే మంచిదా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆవు పాలు ఎందుకు శ్రేష్ఠం?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్న పిల్లలకు బర్రె పాల కంటే ఆవు పాలే అత్యంత ఉత్తమమైనవి. బర్రె పాలతో పోలిస్తే ఆవు పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చిన్నపిల్లల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఆవు పాలను త్వరగా, సులువుగా జీర్ణం చేసుకోగలదు. చిన్నపిల్లల శరీర వికాసానికి, పెరుగుదలకు కావలసిన ముఖ్యమైన పోషకాలు ఆవు పాలలో పుష్కలంగా లభిస్తాయి.

బర్రె పాలు ఎప్పుడు పట్టాలి?

బర్రె పాలలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పాలు త్వరగా అరగక పిల్లల్లో జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. అందుకే సాధారణంగా వైద్యులు చిన్న పిల్లలకు ఆవు పాలను మాత్రమే రికమండ్ చేస్తారు. అయితే ప్రతీ బిడ్డ శరీర తత్వం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి, గేదె పాలు ప్రారంభించే ముందు ఒకసారి చిన్నపిల్లల వైద్యుడిని సంప్రదించడం మంచిది.

తల్లిదండ్రులు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు

కొద్ది మొత్తంలోనే మొదలుపెట్టాలి: పిల్లలకు మొదటిసారి ఆవు పాలు లేదా బయటి పాలు పడుతున్నప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇవ్వకూడదు. కొద్దికొద్దిగా అలవాటు చేస్తూ పరిమాణాన్ని పెంచాలి.

అలెర్జీ లక్షణాలు గమనించాలి: బయటి పాలు తాగిన తర్వాత పిల్లల్లో వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు లేదా చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పాలు ఇవ్వడం ఆపి వైద్యుడిని సంప్రదించాలి.

పాలు మాత్రమే సరిపోవు: పిల్లలు ఎదుగుతున్న కొద్దీ కేవలం పాలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో కూడిన సమతుల ఆహారాన్ని అందించాలి. ఇది వారి శారీరక, మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతుంది.

ముఖ్య గమనిక: సంవత్సరం లోపు వయసున్న పిల్లలకు ఎలాంటి బయటి పాలు అలవాటు చేయాలన్నా లేదా మార్చాలన్నా తప్పనిసరిగా పిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us