ఆ సినిమాను, పాత్రను ఇప్పటికీ మిస్ అవుతున్నాః రకుల్
‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన అందం, అభినయంతో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది. అటు ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. సొంతంగా బిజినెస్‌లో కూడా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. హైదరాబాద్ తనకు రెండు ఇల్లు అంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. భాగ్యనగరాన్ని బాగా మిస్ అవుతున్నా… రకుల్: నాన్న […]
‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన అందం, అభినయంతో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది. అటు ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. సొంతంగా బిజినెస్‌లో కూడా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. హైదరాబాద్ తనకు రెండు ఇల్లు అంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
భాగ్యనగరాన్ని బాగా మిస్ అవుతున్నా…
రకుల్: నాన్న సైన్యంలో పని చేస్తుండటం వల్ల చాలా ప్రాంతాలు తిరగాల్సి వచ్చేది. ఆ తరుణంలోనే హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడింది. ఢిల్లీ సొంత ఊరు అయినా.. నాకు హైదరాబాద్‌లో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ క్లోజ్ ఫ్రెండ్. దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ నిమిత్తం విదేశాలు వెళ్లి.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పుడల్లా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.
చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నా…
రకుల్: సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత లైఫ్‌లో ఉండే చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోవాల్సి వస్తుంది. వ్యక్తిగతం అనేది ఉండదు.. అంతా బహిర్గతమే.. కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే విమర్శలు కూడా భరించాల్సి వస్తుంది. అంతేకాకుండా బయటికి షాపింగ్‌కి వెళ్లాలన్న ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్నీ బాధలు ఉన్నా.. ప్రేక్షకులు చూపించే అభిమానం ముందు ఒక్కసారిగా అవన్నీ మాయమయిపోతాయి.
క్రిమినల్ లాయర్‌గా…
రకుల్: త్వరలో నితిన్‌తో చేయబోయే సినిమాలో క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. ప్రస్తుతం హిందీలో నాలుగు సినిమాలు చేస్తున్నా… తమిళంలో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో కూడా నటిస్తున్నా..
వ్యాపారాన్ని తప్పకుండా విస్తరిస్తా…
రకుల్: ప్రస్తుతం విశాఖపట్నంలో ఒకటి.. హైదరాబాద్‌లో రెండు ఫిట్‌నెస్ సెంటర్స్ ఉన్నాయి. సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల సరిగ్గా దృష్టి సారించటలేదు గానీ.. త్వరలోనే తప్పకుండా వాటిని విస్తరించాలనే ఆలోచనలో మాత్రం ఉన్నాను.
ఆ సినిమాను మిస్ కావడం ఇప్పటికీ బాధిస్తోంది…
రకుల్: విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాలో హీరోయిన్‌గా మొదట నన్నే సంప్రదించారు. కానీ అప్పటికే ‘దే దే ప్యార్ దే’ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయడంతో.. ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ‘గీత గోవిందం’ సినిమా చూసిన ప్రతీసారి విజయ్ సరసన నేను నటిస్తే బాగుండేదని అనిపిస్తుంది.