రాజీవ్ హంతకురాలికి పెరోల్

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ కి మద్రాస్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపిన మహిళ గా గుర్తింపు పొందింది. తన కూతురి వివాహానికి ఆరు నెలల పెరోల్ కావాలని, తాను స్వయంగా తన కేసు వాదించుకునేందుకు అనుమతించాలని ఆమె మద్రాస్ హైకోర్టును గత ఏప్రిల్ లో కోరింది. అయితే […]

రాజీవ్ హంతకురాలికి పెరోల్
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jul 05, 2019 | 5:32 PM

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ కి మద్రాస్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపిన మహిళ గా గుర్తింపు పొందింది. తన కూతురి వివాహానికి ఆరు నెలల పెరోల్ కావాలని, తాను స్వయంగా తన కేసు వాదించుకునేందుకు అనుమతించాలని ఆమె మద్రాస్ హైకోర్టును గత ఏప్రిల్ లో కోరింది. అయితే ఆమెకు ఆరు నెలల పెరోల్ ఇచ్చేందుకు అనుమతించని కోర్టు.. 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. 1991 మే 21 న ఎన్నికల ప్రచార నిమిత్తం వైజాగ్ నుంచి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వెళ్లిన నాటి ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ  ఆత్మాహుతి సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఆ కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయగా వారిలో నళిని ఒకరు.