బీజేపీ శ్రేణులకు రాజాసింగ్ టాస్క్… అదిరింది పోవయ్యా ఎమ్మెల్యే!

బీజేపీ శ్రేణులకు రాజాసింగ్ టాస్క్... అదిరింది పోవయ్యా ఎమ్మెల్యే!

బీజేపీ పార్టీ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ టాస్క్ ఇచ్చారు. అది కూడా అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14వ తేదీ) రోజునే పూర్తి చేయాలని సూచించారు. ఆ టాస్క్ పూర్తి చేయకుండా...

Rajesh Sharma

|

Apr 14, 2020 | 3:24 PM

బీజేపీ పార్టీ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ టాస్క్ ఇచ్చారు. అది కూడా అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14వ తేదీ) రోజునే పూర్తి చేయాలని సూచించారు. ఆ టాస్క్ పూర్తి చేయకుండా తనను కలిసేందుకు ఎవరైనా వస్తే ఊరుకోనని రాజాసింగ్ ఏకంగా వార్నింగిచ్చేశారు.

హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో మంగళవారం నిరాడంబరంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి పేరిట హంగామా చేయొద్దని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి బీజేపీ కార్యకర్త కనీసం ఐదుగురు పేద ప్రజలకు భోజనం పెట్టాలని రాజాసింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ పూర్తి చేయకుండా తనను కలిసేందుకు ఎవరూ రావద్దని కండీషన్ కూడా విధించారు.

కరోనా నేపథ్యంలో తనను కలిసేందుకు తన నియోజకవర్గ ప్రజలు ఎవరు రావొద్దని సూచించిన రాజసింగ్.. కార్యకర్తలు , ప్రజలు గిఫ్టులు తెచ్చే బదులు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందివ్వాలని కోరారు. రాజాసింగ్ ఇచ్చిన పిలుపుతో పలువురు తమ కాలనీల్లో కొందరికి అన్నదానం చేసి వచ్చినట్లు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu