AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైనా, ఎదిగినా ఒదిగే సాగాడు

2020 ఆగ‌ష్టు 15. ఈ తేదీ క్రికెట్ అభిమానుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. భార‌త దేశానికి ఎన్నో విజ‌యాలు అందించిన భార‌త క్రికెట్ టీమ్ మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోని, ఆ విజయాల్లో కీల‌క పాత్ర పోషించిన సురేష్ రైనా ఇద్ద‌రూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

రైనా, ఎదిగినా ఒదిగే సాగాడు
Ram Naramaneni
|

Updated on: Aug 16, 2020 | 3:43 PM

Share

2020 ఆగ‌ష్టు 15. ఈ తేదీ క్రికెట్ అభిమానుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. భార‌త దేశానికి ఎన్నో విజ‌యాలు అందించిన భార‌త క్రికెట్ టీమ్ మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోని, ఆ విజయాల్లో కీల‌క పాత్ర పోషించిన సురేష్ రైనా ఇద్ద‌రూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఈ న్యూస్‌ను ఫ్యాన్స్ అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాగా సురేష్ రైనా అద్బుత‌మైన‌ ప్లేయ‌ర్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్..ఇలా అన్ని విభాగాల్లో రాణించే అత‌డు ఎప్పుడూ అటెన్ష‌న్ కోరుకోలేదు. జ‌స్ట్ త‌న ప‌ని తాను చేసి జ‌ట్టులో వెన‌కే ఉండేవాడు. ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన నిమిషాల్లోనే యూపీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్లేయ‌ర్ రిటైర్మెంట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా మందిని ఆశ్యర్చ‌పరిచింది.

2005 లో ఇండియా టీమ్‌లోకి అడుగుపెట్టిన‌ సురేశ్ రైనా చివరిగా 2018లో భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. అప్ప‌ట్నుంచి అత‌డు జ‌ట్టులోకి రావ‌డానికి ప్రయ‌త్నించినా సెలెక్ట‌ర్ల‌ను ఆక‌ట్టుకోలేకపోయాడు. ‘నేను 30 బంతుల్లో 50 ప‌రుగులు చేసే ఆట‌గాడిని. 60 బంతులు ఆడి 50 ప‌రుగులు చేసే ఆట‌గాడిని కాదు’ అని ఒకానొక సంద‌ర్భంలో రైనా చేసిన కామెంట్స్ గురించి ఇప్ప‌టికీ చాలామంది చెబుతూ ఉంటారు. అవును రైనా ఎప్పుడూ హాఫ్ సెంచ‌రీలు, సెంచ‌రీల కోసం ఆడ‌లేదు. ఆ సంద‌ర్భంలో జ‌ట్టుకు త‌న అవ‌స‌రం మేర‌కే ప్ర‌ద‌ర్శ‌న చేసేవాడు. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పు, చేర్పులు ఉన్నా పెద్ద‌గా ప‌ట్టించుకునేవాడు కాదు. త‌న సార‌థి ధోని మాట‌నే వేదంగా భావించేవాడు. వైట్-బాల్ క్రికెట్‌లో అతడి ప్ర‌ద‌ర్శ‌న ఎన్నోసార్లు జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చింది. 226 వన్డేలు, 18 టెస్టులు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు రైనా. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఖ్యాతి గ‌డించాడు. 2020 టీ20 వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి గుడ్ బై చెప్పాలని ఆశించాడు. కానీ.. కోవిడ్ కారణంగా ఈ టోర్నీ 2022కి వాయిదా పడిపోయింది. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచిగా రాణించి మళ్లీ భార‌త టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తానని ఇటీవల ధీమా వ్యక్తం చేశాడు. కానీ తన కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అదే బాటలో పయనించి అంద‌రినీ ఆశ్య‌ర్య‌ప‌రిచాడు.

Also Read :

అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

Follow Us