నీళ్లతో నడిచే రైల్ ఇంజన్…

| Edited By: Srinu

May 11, 2019 | 5:46 PM

పర్యావరణానికి మేలు చేసే విధంగా నీళ్లతో (డిస్టిల్డ్ వాటర్) నడిచే ఓ సరికొత్త రైలు ఇంజిన్‌ను కనిపెట్టినట్టు తమిళనాడుకు చెందిన ఇంజినీర్ సౌంతిరాజన్ కుమారసామి వెల్లడించారు. ఈ రైలు ఇంజన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. త్వరలో జపాన్‌లో దీన్ని ఆవిష్కరించనున్నట్టు కోయంబత్తూర్‌కి చెందిన సదరు ఔత్సాహిక ఇంజినీర్ మీడియాకి తెలిపారు. ‘‘ఇలాంటి రైల్ ఇంజన్ ప్రపంచంలోనే మొదటిది. దీన్ని అభివృద్ధి చేయడానికి నాకు పదేళ్లు పట్టింది. వాస్తవానికి ఈ ఇంజిన్‌ను […]

నీళ్లతో నడిచే రైల్ ఇంజన్...
Follow us on

పర్యావరణానికి మేలు చేసే విధంగా నీళ్లతో (డిస్టిల్డ్ వాటర్) నడిచే ఓ సరికొత్త రైలు ఇంజిన్‌ను కనిపెట్టినట్టు తమిళనాడుకు చెందిన ఇంజినీర్ సౌంతిరాజన్ కుమారసామి వెల్లడించారు. ఈ రైలు ఇంజన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. త్వరలో జపాన్‌లో దీన్ని ఆవిష్కరించనున్నట్టు కోయంబత్తూర్‌కి చెందిన సదరు ఔత్సాహిక ఇంజినీర్ మీడియాకి తెలిపారు. ‘‘ఇలాంటి రైల్ ఇంజన్ ప్రపంచంలోనే మొదటిది. దీన్ని అభివృద్ధి చేయడానికి నాకు పదేళ్లు పట్టింది. వాస్తవానికి ఈ ఇంజిన్‌ను భారత్‌లోనే ఆవిష్కరించాలన్నది నా కల. దీనిపై అధికారులు, పాలకులందరినీ నేను కలుసుకున్నా స్పందన రాలేదు. జపాన్‌ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో వాళ్లు నాకు అవకాశం ఇచ్చారు. త్వరలోనే జపాన్‌లో దీన్ని పరిచయం చేస్తాను..’’ అని కుమారసామి వెల్లడించారు.