Raghava Lawrence: రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం పట్ల నేనూ బాధతో ఉన్నాను.. కానీ జరగరానిది ఏదైనా జరిగితే..

|

Jan 13, 2021 | 6:03 AM

Raghava Lawrence About Rajini: తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు తమిళనాడులో...

Raghava Lawrence: రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం పట్ల నేనూ బాధతో ఉన్నాను.. కానీ జరగరానిది ఏదైనా జరిగితే..
Follow us on

Raghava Lawrence About Rajini: తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు తమిళనాడులో కొత్త రాజకీయా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు రజినీ ప్రకటించారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన ఓ షూటింగ్‌లో రజినీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన రాజకీయ అరంగేట్రంపై వెనకడుగు వేశారు. ఇక అప్పటి నుంచి రజినీ అభిమానులు ఆయన్ని రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై స్పందించాడు నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌. స్వతహాగ రజినీ అభిమాని అయిన లారెన్స్‌ ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా ఒక లేఖను పోస్ట్‌ చేశాడు. ఇందులో లారెన్స్‌ ఏం చెప్పాడంటే.. ‘తలైవర్‌ రజినీకాంత్‌ను తన నిర్ణయం మార్చుకోమని చెప్పమని ఇప్పటికీ నన్ను కొంతమంది అడుగుతున్నారు. ఈ కారణంగానే నేను ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. రజినీ గారు రాజకీయాల్లోకి రాకపోవడం పట్ల మీరెంత బాధతో ఉన్నారో నేనూ అంతే బాధపడుతున్నాను. కానీ ఆయన వేరే ఏదైనా కారణం చెప్పి ఉంటే మనం ఆయన నిర్ణయాన్ని మార్చుకోమని అడగొచ్చు. కానీ తలైవర్‌ చెప్పిన కారణం అనారోగ్యం. ఇలాంటి తరుణంలో మన ఒత్తిడి మేరకు ఆయన రాజకీయాల్లోకి వస్తే అప్పుడేదైనా జరగరానిది జరిగితే ఆ బాధను జీవితాంతం మర్చిపోలేము. ఆయన ఆరోగ్యం గురించి నాకు తెలుసు. అందుకే ఇప్పుడు మనమందరం ఆయన ఆరోగ్యం కోసం ఆ భగవంతుడిని వేడుకోవాలి. ఆయన కోసం నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయి. గురువే శరణం’ అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్‌.

Also Read: Rakul Preet Singh: ఎవరన్నారు రకుల్ పని అయిపోయింది అని.. అమ్మడి ఖాతాలో 8 సినిమాలు.. లెక్క ఇదిగో..