AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Prime: గమనించారా..? అమేజాన్‌ ప్రైమ్‌ పేరుమారింది.. అసలు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియక..

Why Amazon Changed Name: ఆన్‌లైన్‌ షాపింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అమేజాన్‌ సంస్థ అనంతరం అమేజాన్‌ ప్రైమ్‌ పేరుతో ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే...

Amazon Prime: గమనించారా..? అమేజాన్‌ ప్రైమ్‌ పేరుమారింది.. అసలు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియక..
Narender Vaitla
|

Updated on: Jan 13, 2021 | 5:57 AM

Share

Why Amazon Changed Name: ఆన్‌లైన్‌ షాపింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అమేజాన్‌ సంస్థ అనంతరం అమేజాన్‌ ప్రైమ్‌ పేరుతో ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓటీటీ రంగానికి సరికొత్త అర్థం చెబుతూ దూసుకొచ్చిన అమేజాన్‌ హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిస్తూ డిజిటల్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ‘అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో’ పేరులో ఓ చిన్న మార్పు చేసింది. అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) పేరులో ఉన్న ‘ME’అక్షరాలను తొలగించింది. సోషల్‌ మీడియా వేదికగా కూడా పేరు మార్చింది. ఇక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలుపుతూ అమేజాన్‌ సంస్థ.. ‘ప్రై వీడియో’ అనే ఒక పోస్టు పెట్టి #WhereIsME అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేసింది. ఇక అమేజాన్‌ ఎందుకిలా పేరు మార్చిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అసలు ఎందుకు పేరు మార్చారు.. ఎందుకు ఈ రెండు అక్షరాలను తొలగించారు అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా దీనిపై ఫన్నీ మీమ్స్‌ రూపొందిస్తూ నెట్టింట్లో పోస్ట్‌ చేస్తున్నారు. అమేజాన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్న కారణమేంటో తెలియాలంటే సంస్థ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి.

Also Read: ఆహారాన్ని వడ్డించే రోబోలు వచ్చేసాయి.. ‘ఫ్లంకీ’గా నామకరణం‌.. ఎక్కడున్నాయో తెలుసా..