Rakul Preet Singh: ఎవరన్నారు రకుల్ పని అయిపోయింది అని.. అమ్మడి ఖాతాలో 8 సినిమాలు.. లెక్క ఇదిగో
ఎరక్కపోయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్‌ని మొన్నటిదాకా అందరూ ఏమన్నారో గుర్తుందిగా. ఇక ఆమె పని అయిపోయినట్లే . ఆమె స్టార్డమ్ ఖతం అయినట్లే అని కోడై కూశారు.
Rakul Preet Singh: ఎరక్కపోయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్‌ని మొన్నటిదాకా అందరూ ఏమన్నారో గుర్తుందిగా. ఇక ఆమె పని అయిపోయినట్లే . ఆమె స్టార్డమ్ ఖతం అయినట్లే అని కోడై కూశారు. కానీ.. నేలక్కొట్టిన బంతిలా ఫుల్ స్వింగ్‌తో బౌన్స్ బ్యాక్ అయింది ఈ బ్యూటీ. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సినిమాలు.. రకుల్ ఖాతాలో వున్నాయిప్పుడు. ఓపికుంటే లెక్కపెట్టుకోండి మరి. తెలుగులో క్రిష్ సినిమాలో గొర్రెల కాపరిగా కనిపిస్తారు రకుల్. షూటింగ్ కూడా అయిపోయింది.
ఇది కాకుండా.. నితిన్‌తో చేస్తున్న ‘చెక్’ మూవీ.. తమిళ్లో కమల్ పక్కన ‘ఇండియన్2’.. ఇక హిందీలో అయితే.. ‘మేడే’, ‘థ్యాంక్‌గాడ్’, ‘ఎటాక్’.. ఇలా జోరు మీదుంది రకుల్. ఇంకా ‘దేదేప్యార్ దే’ అంటూ రకుల్‌కి వెల్కమ్ చెబుతోంది బీటౌన్. సో.. మొత్తం కలిపి ఎనిమిది సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదే ఇయర్లో అవి రిలీజ్ కాబోతున్నాయి. నిజం చెప్పాలంటే ఇది ఒక రికార్డే.
Also Read:
Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున