Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున

భారతదేశంలో మద్యం అక్రమ రవాణా వ్యాపారం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వాలు, పోలీసులు మద్యం అక్రమ రవాణాకు అడ్డకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా..

  • Ram Naramaneni
  • Publish Date - 5:14 pm, Tue, 12 January 21

Viral News: భారతదేశంలో మద్యం అక్రమ రవాణా వ్యాపారం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వాలు, పోలీసులు మద్యం అక్రమ రవాణాకు అడ్డకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా  బీహార్‌లో మద్యం అక్రమ రవాణాకు వేసిన స్కెచ్ చూస్తే.. మీకు ఆశ్చర్యం కలగకమానదు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో మద్యం అక్రమ రవాణా, నిల్వకు సంబంధించి ఒక కొత్త కేసు వచ్చింది.  మద్యం స్మగ్లర్లు ఎలుక కన్నాల మాటున అక్రమ మద్యాన్ని స్టోర్ చేశారు. ఆపరేషన్ సమయంలో, ఎలుక కన్నాలకు కలిగి ఉన్న గిడ్డంగి నుంచి వందలాది మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

షేక్ తోలి గ్రామంలో మద్యం అక్రమ రవాణాదారుడు భారీ మొత్తంలో మద్యం దాచినట్లు తనకు రహస్య సమాచారం అందిందని గోపాల్గంజ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా మనోజ్ కుమార్ ఇంట్లో ఎక్సైజ్ టీమ్ సోదాలు నిర్వహించింది. కానీ దాడుల్లో స్మగ్లర్ ఇంట్లో ఎటువంటి మద్యం లభించలేదు. ఈ క్రమంలో టీమ్ వెనక్కి తిరుగుతున్న సమయంలో ఓ ఎలుక కన్నం కనిపించింది. ఆ కన్నాన్ని పూర్తిగా పరిశీలించగా..ఎక్సైజ్ టీమ్ కంగుతిన్నారు. లోపల అనేక విదేశీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ఈ కేసులో ఇంటి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్‌లో మద్యం నిషేధించినప్పటికీ, అక్కడి ప్రజలు మహారాష్ట్ర కంటే ఎక్కువ మద్యం తాగుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ఇటీవల జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అందుతోన్న రిపోర్టుల ప్రకారం.. మద్యపాన నిషేధం ఉన్న బీహార్‌లో 15.5 శాతం మంది మద్యం సేవించేవారు ఉండగా, మహారాష్ట్రలో తాగే వారి సంఖ్య 13 శాతంగా ఉంది.

Also Read:

పులిని పట్టుకునేందుకు ఆవును ఎరగా వేయడంపై భగ్గుమన్న రాజాసింగ్.. ఇదేం పద్దతని అటవీ శాఖపై ఫైర్

AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు

Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం