ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
ప్రతిరోజు మనం వాడే పసుపు కల్తీ అవుతోంది. మార్కెట్‌లో దొరికే పసుపు స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీటి టెస్ట్, చేతి రుద్ది చూసే పద్ధతి, నిమ్మరసం, సబ్బు నురగ టెస్ట్‌లు వంటి సులభమైన ఇంటి చిట్కాలతో అసలు పసుపును నకిలీ పసుపు నుండి వేరు చేయవచ్చు. మీ ఆరోగ్యానికి రక్షణగా ఉండే పసుపు స్వచ్ఛతను ఈ టెస్ట్‌ల ద్వారా గుర్తించండి.

ప్రతిరోజు వంటలలో పసుపు తప్పనిసరిగా వినియోగిస్తారు. పసుపు ఆహారాన్ని రుచికరంగా చేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే, నేటి కల్తీ మార్కెట్‌లో అన్నీ రకాల వస్తువులు, తినే ఆహార పదార్థాలు కూడా కల్తీ అవుతున్నాయి. ఇందులో పసుపు కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మార్కెట్లో లభించే పసుపు నకిలీది కూడా కావచ్చు. కాబట్టి, అసలైన, నకిలీ పసుపును ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు వాడుతున్న పసుపు అసలైనదేనా..? ఎందుకంటే..మార్కెట్లో లభించే పసుపు నకిలీది కూడా కావచ్చు. కాబట్టి అసలైన, నకిలీ పసుపును ఎలా గుర్తించాలో తెలుసుకోండి. ఇందుకోసం ఒక స్పూన్ పసుపు పొడిని నీటిలో వేయండి. అది నీటిలో మునిగితే అది నిజమైనది. రంగు ఎక్కువైతే పసుపులో కల్తీ ఉందని అర్థం. లేదంటే, పసుపును చేతిలో రుద్ది చూసినప్పుడు అది రంగు అంటితే నిజమైనది, లేకపోతే నకిలీది.
పసుపు వాసన తాజాగా, సహజంగా అనిపిస్తే అది నిజమైనదిగా గుర్తించండి. పసుపు పొడిలో నిమ్మరసం చుక్కలు వేసి చూడండి.. అది నకిలీ అయితే నురగ వస్తుంది. లేదంటే, పసుపుని నీటిలో కలిపి, అందులో సబ్బు నురగ కలపండి.. అప్పుడు దాని రంగు ముదురుగా ఉంటే మీ పసుపు నకిలీది అని అర్థం. పసుపు పొడిలో అయోడిన్ కలిపినప్పుడు రంగు నలుపు లేదా నీలం రంగులోకి మారితే, పిండి పదార్థం కలిసినట్లుగా భావించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




