Train Ticket Booking: ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. నేటి నుంచే అమల్లోకి.. కొత్త నిబంధనలు ఇవే..
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ల బుకింగ్ రూల్స్‌లో జనవరి 12వ తేదీ నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి టికెట్ బుక్ చేసుకోవాలంటే కఠిన నిబంధనలను రైల్వేశాఖ అమల్లోకి తెచ్చింది. ఆ రూల్స్ ఏంటంటే..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వే టికెట్ బుకింగ్ రూల్స్ జనవరి 12 నుంచి పూర్తిగా మారాయి. నేటి నుంచి ఐఆర్‌సీటీసీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఐఆర్‌సీటీసీ ఫ్లాట్‌ఫామ్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే టికెట్ బుకింగ్‌కు తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్నవారికి టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి టికెట్లు రిలీజ్ అయిన రోజు కేవలం ఆధార్ వెరిఫికేషన్ చేసుకుున్నవారు మాత్రమే బుక్ చేసుకోవడానికి కుదురుతుంది. ఆధార్ వెరిఫికేషన్ చేసుకోనివారు రైలు కోసం టికెట్లు తెరిచిన మొదటి రోజు అడ్వాన్స్‌డ్ బుకింగ్ చేసుకోవడానికి కుదరదు. టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, నిజమైన ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త బుకింగ్ రూల్స్ ఇవే..
రైల్లో ప్రయాణించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మనం చేసుకుంటూ ఉంటాం. ఇక నుంచి రైలు టికెట్లు విడుదలైన రోజు ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్నవారు మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకోగలుగుతారు. మిగతావారు చేసుకోవడానికి వీల్లేకుండా బ్యాక్ ఎండ్‌లో మార్పులు చేశారు. ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్నవారు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఆ ప్రక్రియ పూర్తి చేయనివారు తర్వాతి రోజు మాత్రమే ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మొదటి రోజున జనరల్ రిజర్వ్‌డ్ టికెట్లుకు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. రైల్వే స్టేషన్ల రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ రూల్స్ ఉండవు. నేటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.
అక్రమాలకు చెక్
టికెట్లు రిలీజ్ చేయగానే కొంతమంది వ్యక్తులు, ఏజెంట్లు ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించి వేగంగా టికెట్లు బుక్ చేస్తున్నారు. దీని వల్ల సామాన్యులకు టికెట్లు అందటం లేదు. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ బేస్డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. దీంతో ఐఆర్‌సీటీసీ యూజర్లు అందరూ తమ ఆధార్‌ను అకౌంట్‌తో లింక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని వల్ల సులువుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేశారు. అంటే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవలంటే ఆధార్ నెంబర్ ఓటీపీ ప్రాసెస్ పూర్తి చేయల్సి ఉంటుంది. గత ఏడాది నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీని వల్ల రైల్వే టికెట్లను అక్రమంగా బుక్ చేసుకోవడానికి కుదరదు.
