Psycho movie : సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ‘సైకో’.. ఆసక్తి కలిగిస్తున్న పోస్టర్స్

నిత్యామీన‌న్‌, అదితిరావు హైద‌రి, ఉద‌య‌నిధి స్టాలిన్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘మిస్కిన్ సైకో’. డీఎస్ సినిమాస్ ప‌తాకం..

Psycho movie : సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన 'సైకో'.. ఆసక్తి కలిగిస్తున్న పోస్టర్స్
Follow us

|

Updated on: Jan 14, 2021 | 6:21 PM

psycho movie: నిత్యామీన‌న్‌, అదితిరావు హైద‌రి, ఉద‌య‌నిధి స్టాలిన్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘మిస్కిన్ సైకో’. డీఎస్ సినిమాస్ ప‌తాకంపై డి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. ‘పిశాచి’, ‘డిటెక్టివ్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ద‌ర్శ‌కుడు మిస్కిన్ నుంచి వ‌స్తున్న మ‌రో సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళ‌యరాజా సంగీత సార‌థ్యం వ‌హించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా.. నిర్మాత డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. కొత్తదనాన్ని కోరుకునే తెలుగు సినీ ప్రేక్ష‌కుల కోసం ‘మిస్కిన్ సైకో’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకు వ‌స్తున్నాం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు’.. పవర్‌స్టార్ ఈజ్ బ్యాక్..!