సీఎం ఇంటి వద్ద కాల్ సెంటర్ ఉద్యోగుల నిరసన
ఏపీ సీఎం జగన్‌కు బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు షాకిచ్చారు. తమ న్యాయమైన సమస్యలు సీఎంకు వివరిద్దామని వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. వీవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మొత్తం 13 జిల్లాల బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు వివరించాకే వెళతామని తేల్చిచెప్పారు. గత 12 ఏళ్లుగా బీమా ఉద్యోగులుగా ఉన్న తమకు ఇప్పటి వరకూ ఎలాంటి […]
ఏపీ సీఎం జగన్‌కు బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు షాకిచ్చారు. తమ న్యాయమైన సమస్యలు సీఎంకు వివరిద్దామని వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. వీవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మొత్తం 13 జిల్లాల బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు వివరించాకే వెళతామని తేల్చిచెప్పారు.
గత 12 ఏళ్లుగా బీమా ఉద్యోగులుగా ఉన్న తమకు ఇప్పటి వరకూ ఎలాంటి జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిపించాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని వారు కోరుతున్నారు. చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా తమ సమస్యలు తీరడం లేదని.. సీఎం జగన్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బీమా ఉద్యోగులు ఆకాక్షించారు.