“ఎదురీత ముందు విధిరాత ఎంత”‌.. సీఎం జగన్ను కలిసిన ఐఏఎస్ సింహాచలం

సీఎం జ‌గ‌న్ చూపిన ప్రేమ‌, ఆప్యాయత త‌నలో‌ నూతన ఉత్తేజాన్ని నింపాయ‌ని యువ ఐఏఎస్‌ కట్టా సింహాచలం తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్ర‌జ‌ల‌కు చేరువ చెయ్య‌డంతో అత్యంత నిబద్ధతతో వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం జగన్‌ సూచించారని అన్నారు. 2019 ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సింహాచలం మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఉత్తమ పాలన అందించేలా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ గ్రామస్వరాజ్య స్థాపనకు […]

ఎదురీత ముందు విధిరాత ఎంత‌.. సీఎం జగన్ను కలిసిన ఐఏఎస్ సింహాచలం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 9:29 AM

సీఎం జ‌గ‌న్ చూపిన ప్రేమ‌, ఆప్యాయత త‌నలో‌ నూతన ఉత్తేజాన్ని నింపాయ‌ని యువ ఐఏఎస్‌ కట్టా సింహాచలం తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్ర‌జ‌ల‌కు చేరువ చెయ్య‌డంతో అత్యంత నిబద్ధతతో వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం జగన్‌ సూచించారని అన్నారు. 2019 ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సింహాచలం మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఉత్తమ పాలన అందించేలా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ గ్రామస్వరాజ్య స్థాపనకు చ‌క్క‌గా ఉపయోగపడుతుందని ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు. మహిళలు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు తీసుకొచ్చిన దిశా చట్టం..వారికి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. అంధత్వాన్ని తాను ఏనాడూ ఇబ్బందిగా చూడ‌లేద‌ని, అంగవైకల్యం లక్ష్యానికి అడ్డు కాదు అని చెప్పేందుకు తానే నిదర్శనమని చెప్పారు. సొంత రాష్ట్రంలో ఐఏఎస్‌గా ఛాన్స్ రావ‌డం త‌న‌కు ఎంతో ఆనందం క‌లిగిస్తోంద‌ని క‌ట్టా సింహాచలం తెలిపారు.

తాను వైద్యుడిగా రాణించాల‌నుకున్నాన‌ని, కానీ చూపు లేక‌పోవ‌డంతో అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ప్రజల‌కు సేవ చేయాల‌నే ల‌క్ష్యంతో ఐఏఎస్‌ సాధించానని, లోపాలు ఉన్నవారిని వివ‌క్ష‌తో చూడకుండా ప్రోత్సహిస్తే..అద్భుత ఫ‌లితాలు సాధిస్తార‌ని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన కట్టా సింహాచలంకు పుట్టుకతోనే చూపులేదు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కావాల‌న్న‌ తన కలను సాకారం చేసుకున్నారు.

Latest Articles