క్రేజీ కాంబో.. సూర్య పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్..!
తమిళ స్టార్ హీరో సూర్య మూవీకి టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. సూర్య హీరోగా..లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సురరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో రిలీజ్ కాబోతుంది. గతంలో శ్రీనివాస మూర్తి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్..సూర్య చిత్రాలకు తెలుగులో గొంతు అరువిచ్చేవాడు. కొన్ని చిత్రాలకు సూర్య తానే సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఈసారి మరో హీరో చెప్తే..ఎలా ఉంటుందో అని […]

తమిళ స్టార్ హీరో సూర్య మూవీకి టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. సూర్య హీరోగా..లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సురరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో రిలీజ్ కాబోతుంది. గతంలో శ్రీనివాస మూర్తి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్..సూర్య చిత్రాలకు తెలుగులో గొంతు అరువిచ్చేవాడు. కొన్ని చిత్రాలకు సూర్య తానే సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఈసారి మరో హీరో చెప్తే..ఎలా ఉంటుందో అని టెస్ట్ చెయ్యాలనుకుంటున్నాడట సూర్య.
సూర్య బాడీ లాంగ్వేజ్‌కు, స్టైల్ కు తెలుగులో ఎవరు బాగా డబ్బింగ్ చెప్పగలరు? అని అన్వేశించగా సత్య దేవ్ వాయిస్ అయితే సరిగ్గా సెట్ అవుతుందని మూవీ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు కూడా నడుస్తున్నాయట. మరి సూర్య నటనకు సత్యదేవ్ వాయిస్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్ గోపీనాథ్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ మూవీ సమ్మర్ లో సందడి చేయాల్సి ఉండగా… లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.




