తెలంగాణ వ్యాప్తంగా.. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పథకం నేటి నుంచి ఆగిపోతోంది. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆరోగ్య శ్రీకి సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పథకానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లులు వస్తాయని ఇన్ని రోజులుగా ఎదురుచూసిన ప్రైవేట్ ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారి బిల్లులు మంజూరు […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:42 am, Fri, 16 August 19
తెలంగాణ వ్యాప్తంగా.. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పథకం నేటి నుంచి ఆగిపోతోంది. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆరోగ్య శ్రీకి సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పథకానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లులు వస్తాయని ఇన్ని రోజులుగా ఎదురుచూసిన ప్రైవేట్ ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారి బిల్లులు మంజూరు కాకపోవటంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, 2007లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2008లో ఖమ్మం జిల్లాలో కేవలం మూడు ఆస్పత్రుల ద్వారా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు పెరుగుతూ వచ్చాయి. ఇక 2014 నుంచి ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చిన ఆస్పత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 21 వైద్యశాలలు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి.