కేరళలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. భారీ వరదల కారణంగా 104 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 36 మంది గల్లంతయ్యారు.11వేల ఇళ్లకుపైగా దెబ్బతిన్నాయి. మరో వెయ్యి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో రెండు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు పడుతున్న 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అయితే క్రమంగా వర్షాలు […]

కేరళలో తగ్గుముఖం పట్టిన వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 5:53 AM

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. భారీ వరదల కారణంగా 104 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 36 మంది గల్లంతయ్యారు.11వేల ఇళ్లకుపైగా దెబ్బతిన్నాయి. మరో వెయ్యి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో రెండు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు పడుతున్న 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అయితే క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. వరద తీవ్రత కూడా తగ్గింది. దీంతో రెడ్ అలెర్ట్‌ను ఎత్తివేశారు.