కడపః బద్వేలులో ప్రభుత్వ ఆఫీసులకు నిలిచిపోయిన కరెంట్ సరఫరా
కడప జిల్లా బద్వేలులోని ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ సరఫరా నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రోడ్లు భవనాల కార్యాలయం, నీటిపారుదల..
కడప జిల్లా బద్వేలులోని ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ సరఫరా నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రోడ్లు భవనాల కార్యాలయం, నీటిపారుదల శాఖ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, తాహసీల్దార్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రభుత్వ సేవలన్నీ స్తంభించి పోయాయి. దీంతో కార్యాలయాల ముందు ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Read More:
సీఎంవో సిబ్బందికి కరోనా పాజిటివ్.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం
139 మంది అత్యాచారం కేసులో కీలకంగా మారిన ‘డాలర్ బాయ్’
నిత్యానందపై పొగడ్తల వర్షం కురిపించిన తమిళ నటి
వరల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్లకి చేరిన పాజిటివ్ కేసులు