ఏపీలో పొలిటికల్ పోలరైజేషన్..ఈసారి కలిసే పార్టీలేవంటే ?

ఏపీలో ఇసుక రాజకీయం దుమారం రేపుతోంది. ఇసుక కొరతపై ఆందోళనను పీక్ లెవెల్‌కు తీసుకువెళ్ళేందుకు టిడిపి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఆల్‌రెడీ ఇసుక అంశంపై విశాఖ లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన పార్టీ ప్రభుత్వంపై మాటల యుద్దం చేస్తోంది. ఓ దశలో ఇసుక ఆధారిత ఆరోపణలు కాస్తా.. ముఖ్యమంత్రి జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య వ్యక్తిగత దూషణలకు వెళ్ళినా.. చివరికి ట్రాక్ తప్పలేదని ఇద్దరూ నిరూపించారు. ఈ నేపథ్యంలో గురువారం బెజవాడ కేంద్రంగా […]

ఏపీలో పొలిటికల్ పోలరైజేషన్..ఈసారి కలిసే పార్టీలేవంటే ?
Follow us

|

Updated on: Nov 13, 2019 | 12:29 PM

ఏపీలో ఇసుక రాజకీయం దుమారం రేపుతోంది. ఇసుక కొరతపై ఆందోళనను పీక్ లెవెల్‌కు తీసుకువెళ్ళేందుకు టిడిపి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఆల్‌రెడీ ఇసుక అంశంపై విశాఖ లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన పార్టీ ప్రభుత్వంపై మాటల యుద్దం చేస్తోంది. ఓ దశలో ఇసుక ఆధారిత ఆరోపణలు కాస్తా.. ముఖ్యమంత్రి జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య వ్యక్తిగత దూషణలకు వెళ్ళినా.. చివరికి ట్రాక్ తప్పలేదని ఇద్దరూ నిరూపించారు. ఈ నేపథ్యంలో గురువారం బెజవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జరపతలపెట్టిన దీక్ష ఏపీలో పొలిటికల్ పోలరైజేషన్‌కు దారితీసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇసుక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి ఏపీలో ప్రతిపక్షాలు. ఇసుక సరఫరాను పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే… ప్రతిపక్షాలు ఈ ఇష్యూను మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక రోజు దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆయన దీక్షకు ఏఏ పార్టీలు వస్తాయి ఆనేది ఆసక్తికరంగా మారింది. ఇసుక సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నా.. వరదల వల్ల కుదరడం లేదని చెబుతోంది అధికార పార్టీ. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.

ఇసుక కొరతకు నిరసనగా, నిర్మాణ కార్మికులకు మద్దతుగా 14వ తేదీన 12 గంటలపాటు దీక్ష చేయబోతున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చేయాలని మొదట భావించినా పోలీసుల నుంచి అనుమతి రాలేదు. దీంతో ధర్నా చౌక్‌ దగ్గర దీక్షకు ప్లాన్‌ చేస్తోంది టీడీపీ. చంద్రబాబు దీక్షకు ఇప్పుడు ఎవరెవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. విశాఖలో జనసేన లాంగ్‌ మార్చ్‌కు టీడీపీ మద్దతు పలికింది.

పార్టీ నుంచి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఇప్పుడు జనసేన నుంచి కూడా చంద్రబాబు దీక్షకు పవన్‌ కల్యాణ్ స్వయంగా వస్తారా? లేక పార్టీ తరపున ప్రతినిధులు పంపిస్తారా? మాత్రమే ఇస్తారా? అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం జనసేనానితో టిడిపి నేతలు భేటీ అయ్యారు.

చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వాలని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఇసుక పోరాటం ఎవరు చేసినా సంఘీభావం ప్రకటిస్తామన్న కన్నా.. దీక్షకు హాజరయ్యే విషయంలో మాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సో.. దీక్షకు బిజెపి రాదన్న సంగతి క్లారిటీ వచ్చేసింది.

ఇక సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఇటీవల ఇసుక కొరతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. దీనికి టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి కూడా నేతలు హాజరయ్యారు. ఇప్పుడు లెఫ్ట్‌ పార్టీలు టీడీపీ దీక్షకు వస్తాయా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇటు కాంగ్రెస్‌ కూడా ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చంద్రబాబు దీక్షకు వచ్చే పార్టీలను బట్టి రాబోయే రోజుల్లో ఏపీలో నడిచే రాజకీయం అంచనా వేయొచ్చనేది రాజకీయ పరిశీలకుల మాట.

ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాయా? లేదా అనేది చంద్రబాబు దీక్షతో తేలిపోనుంది. ఒకవేళ టిడిపి, జనసేనతోపాటు వామపక్షాలు చంద్రబాబు దీక్షలో పాల్గొంగే ఏపీలో పొలిటికల్ పోలరైజేషన్‌కు ఓ రూపు వచ్చేసినట్లేనని పరిశీలకులంటున్నారు.