బాధితులను పోలీసులు బెదిరిస్తున్నారు.. బెంగాల్ లో హింసపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు..
బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. తమకు (మానవ హక్కుల సంఘాల సభ్యులకు) ఫిర్యాదు చేయరాదని బాధితులను పోలీసులు బెదిరిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్...
బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. తమకు (మానవ హక్కుల సంఘాల సభ్యులకు) ఫిర్యాదు చేయరాదని బాధితులను పోలీసులు బెదిరిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) సభ్యుడొకరు ముషీదాబాద్ పోలీసు సూపరెంటెండెంట్ కు తెలిపారు. పోలీసులంటే ప్రజలు భయపడిపోతున్నారని, బీజేపీకి ఓటు వేసినందుకు ఖాకీలు వారిని వేధిస్తున్నారని ఆ సభ్యుడు అన్నారు. అది వారి తప్పా అని ప్రశ్నించారు…నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వైస్ చైర్మన్ కూడా అయిన ఆరిఫ్ రషీద్ అనే ఈయన..ఎన్ హెచ్ ఆర్ సీ సభ్యుడు కూడా. .ఇటీవల తమ కమిషన్ లోని మరికొందరు సభ్యులపై కూడా దాడి యత్నాలు జరిగాయన్నారు. బాధితులు తమతో మాట్లాడడానికి కూడా భయపడ్డారన్నారు.
అటు-జూన్ 10 వరకు సుమారు 3,243 మంది బాధితులు వయొలెన్స్ కి గురయ్యారని రాష్ట్ర లీగల్ సర్వీసుల అథారిటీ మెంబర్ సెక్రటరీ తన రిపోర్టులో తెలిపారు. ఎన్నికల అనంతర హింసలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ని కలకత్తా హైకోర్టు గత జూన్ లో ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టి వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల జాదవ్ పూర్ లో పర్యటించిన కమిటీ సభ్యులపై దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై గవర్నర్ జగదీప్ ధన్ కర్ , కి, సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral News: ‘గోల్డెన్ కపుల్’.. ఒంటిపై మాత్రమే కాదు, ఆ దంపతుల చెప్పులకు, సెల్‌ఫోన్లకు కూడా బంగారమే
నా కొడుక్కి మంత్రి పదవి ఇవ్వరా..? మూల్యం చెల్లించుకుంటారు.. బీజేపీపై ధ్వజమెత్తిన నిషాద్ పార్టీ చీఫ్