మద్యం బాటిల్స్‌‌ను రోడ్డు రోలర్ తో తొక్కించారు

అక్రమ మద్యం రవాణాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాక్ డౌన్ సమయంలో పట్టబడిన అక్రమ మద్యం సీసాలను ఇవాళ రోడ్డు రోలర్ తో తొక్కించారు. వీటిని కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నంలో సుమారు 14 వేల అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై క్రమపద్ధతిలో పేర్చి రోడ్డు రోలర్ సాహాయంతో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ సుమారు రూ.72 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. #WATCH Andhra Pradesh: Police […]

మద్యం బాటిల్స్‌‌ను రోడ్డు రోలర్ తో తొక్కించారు
Follow us

|

Updated on: Jul 17, 2020 | 8:40 PM

అక్రమ మద్యం రవాణాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాక్ డౌన్ సమయంలో పట్టబడిన అక్రమ మద్యం సీసాలను ఇవాళ రోడ్డు రోలర్ తో తొక్కించారు. వీటిని కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నంలో సుమారు 14 వేల అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై క్రమపద్ధతిలో పేర్చి రోడ్డు రోలర్ సాహాయంతో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ సుమారు రూ.72 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

గతంలోనూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇదే తరహాలో మద్యంను ధ్వంసం చేశారు. ఇలా చేస్తేనే అక్రమ మద్యంకు అడ్డుకట్ట వేయవచ్చని ఓ పోలీస్ అధికారి అంటున్నారు.