సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ఎవరా శామ్యూల్, శృతి.?

సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ఎవరా శామ్యూల్, శృతి.?

సుశాంత్ బావమరిది అయిన హర్యానాకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఓపీ సింగ్.. శామ్యూల్ మిరాండా అనే వ్యక్తిని ఇల్లీగల్‌గా అదుపులోకి తీసుకుని విచారించాలని కోరినట్లు..

Ravi Kiran

|

Aug 06, 2020 | 6:42 AM

Sushant Singh Rajput’s family wanted Rhea Chakraborty ‘intimidated’: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరో కొత్త ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. సుశాంత్ బావమరిది అయిన హర్యానాకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఓపీ సింగ్.. శామ్యూల్ మిరాండా అనే వ్యక్తిని ఇల్లీగల్‌గా అదుపులోకి తీసుకుని విచారించాలని కోరినట్లు బాంద్రా మాజీ డిప్యూటీ కమిషనర్ పరంజిత్ సింగ్ దాహియా తెలిపారు. ఇటీవల ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయనకు, ఓపీ సింగ్‌కు సంబంధించిన వాట్సాప్ సంభాషణను కూడా బయటపెట్టారు.

ఫిబ్రవరిలో సుశాంత్ ప్రాణానికి ముప్పు ఉందని సుశాంత్ తండ్రి కేకే సింగ్  బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన కంప్లైంట్ స్క్రీన్‌షాట్‌ను కూడా రెండు రోజుల క్రితమే ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ తరుణంలో పరంజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీస్తున్నాయి.

రియా చక్రవర్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరించాలని, విచారణ కోసం ఆమె స్నేహితుడు శామ్యూల్ మిరాండాను అదుపులోకి తీసుకోవాలని ఓపీ సింగ్ బాంద్రా పోలీసులను కోరినట్లు దహియా వివరించారు. అంతేకాకుండా ఆయన అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదని.. ప్రతీ విషయం కూడా అన్ అఫీషియల్‌గా నిర్వహించాలని కోరినట్లు పరంజిత్ సింగ్ దాహియా స్పష్టం చేశారు.

ఫిబ్రవరి మొదటివారంలో సింగ్‌ను తన బ్యాచ్‌మేట్‌ ద్వారా కలిసానని చెప్పిన పరంజిత్.. అదే నెల 19, 25 తేదీల్లో సింగ్.. తనకు రియా చక్రవర్తిని అనధికారికంగా విచారించాలని.. అంతేకాకుండా ముంబై పోలీసులు శామ్యూల్ మిరాండాను ఒక రోజు అదుపులో ఉంచితే.. అసలు నిజాలు వాటంతట అవే బయటికి వస్తాయని చెబుతూ వాట్సాప్ మెసేజ్‌లు పెట్టారని పరంజిత్ తెలిపారు.

అయితే వ్రాతపూర్వక, అధికారిక ఫిర్యాదు లేకుండా విచారణను ప్రారంభించడం సాధ్యం కాదని.. ఇదే విషయాన్ని సింగ్‌కు కూడా స్పష్టం చేసినట్లు పరంజిత్ చెప్పుకొచ్చారు. చివరిగా తాను సింగ్‌కు ఫోన్ చేసి.. వ్రాతపూర్వక కంప్లైంట్ ఇమ్మని కోరారని.. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదని అన్నారు. ఇక ఆ తర్వాత సింగ్ ఎప్పుడూ తనని సంప్రదించలేదని.. ఏప్రిల్ 1 తర్వాత తాను బాంద్రా స్టేషన్ నుంచి బదిలీ అయినట్లు పరంజిత్ వెల్లడించారు. కాగా, సుశాంత్ సింగ్ కేసు సీబీఐకు అప్పగించాలని బీహార్ ప్రభుత్వం చేసిన సిఫార్సుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: 

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu