గుంటూరు ‘కామరాజు’కు కత్తెర పడింది

సోషల్ మీడియాలో యువతుల నగ్న చిత్రాలను పోస్ట్ చేస్తానంటూ అమ్మాయిలను బెదిరిస్తున్న నిందితుడిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన..

గుంటూరు కామరాజుకు కత్తెర పడింది

Updated on: Jul 17, 2020 | 5:49 AM

Police Arrest The Man Who blackmails : సోషల్ మీడియాలో యువతుల నగ్న చిత్రాలను పోస్ట్ చేస్తానంటూ అమ్మాయిలను బెదిరిస్తున్న నిందితుడిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజుగడ్డ రఘుబాబు కేరళలోని కొచ్చిలో యానిమేషన్ మల్టీమీడియాలో బీఎస్సీ  పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంత కాలం గుంటూరులోనే ఓ ఐటీ కంపెనీ నడిపించాడు. అయితే లాక్ డౌన్ కారణంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు.

అయితే ఇక్కడే అతడి బుద్ధి పక్కదోవ పట్టింది. తాను చదువుకున్న చదువును చెడ్డదారికి మళ్లించాడు. ఫేక్ వర్చువల్ నెంబర్స్‌తో ‘ఫేక్ ఫేస్ బుక్ ఐడీ’లు క్రీయేట్ చేశాడు. వాటి సహాయంతో తనతో చదువుకున్న అమ్మాయిల ఫోటోలను సేకరించాడు. వాటిని మార్ఫింగ్‌తో చేసేందకు తన బుర్రను ఉపయోగించాడు. ఇంకేముంది ఆ అమ్మాయిలను మార్ఫింగ్ చేశాడు. నగ్న చిత్రాలను తయారు చేశాడు.

తిరిగి ఆ యువతులకు ఈ ఫోటోలను పోస్ట్ చేశాడు. మరిన్ని నగ్న ఫోటోలను పంపించాలని.. లేకుంటే తన వద్ద ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇది చూసిన కొందరు అమ్మాయిలు అతడి నెంబర్‌ను బ్లాక్ చేశారు. అయితే ఓ యువతి మాత్రం ఈ కామరాజు చెప్పినట్లే చేసింది. ఇదిలావుంటే గుంటూరుకు చెందిన ఓ యవతి మాత్రం దైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇక అంతే ఈ కామరాజును పట్టుకునేందుకు సైబర్ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించారు. వాడి ఖాతాను గుర్తు పట్టారు. కామరాజు కథలకు  చెక్ పెట్టారు. ఈ కామరాజును అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టేశారు.