త్వరలో రానున్న.. వీవీఐపీ విమానం ‘ఎయిర్ ఇండియా వన్’!
స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ (ఎస్‌ఇఎస్‌ఎఫ్) లేదా వివిఐపి విమానం 'ఎయిర్ ఇండియా వన్'ను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ ఆఫీసర్లు, వివిఐపి సెక్యూరిటీ సిబ్బంది, సీనియర్ ప్రభుత్వ అధికారుల
స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ (ఎస్‌ఇఎస్‌ఎఫ్) లేదా వివిఐపి విమానం ‘ఎయిర్ ఇండియా వన్’ను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ ఆఫీసర్లు, వివిఐపి సెక్యూరిటీ సిబ్బంది, సీనియర్ ప్రభుత్వ అధికారుల సంయుక్త బృందం అమెరికాకు వెళుతున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. దీనిని దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యాటనల కోసం ఉపయోగిస్తారు.
యూఎస్ ప్రెసిడెంట్ వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉన్నది. ఈ ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానానికి అన్ని పరీక్షలు ముగిశాయి. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలు కలిగిన ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానం ఏకధాటిగా 17 గంటలపాటు ప్రయాణించగలదు. ప్రస్తుతం వీవీఐపీలు వినియోగిస్తున్న బీ 747 జంబో విమానాన్ని ఇది భర్తీ చేస్తుంది.
Read More: