ఉగ్రవాద అంతానికి ప్రపంచ దేశాలను ఏకం చేద్ధాంః ప్రధాని
భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లాభాయ్ పటేల్ 145 జయంతి వేడుకలు పురస్కరించుకుని ఏక్తా దివస్ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్ లోని నర్మదా నది తీరంలోని కేవాడియా వద్ద జరిగిన వేడుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లాభాయ్ పటేల్ 145 జయంతి వేడుకలు పురస్కరించుకుని ఏక్తా దివస్ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్ లోని నర్మదా నది తీరంలోని కేవాడియా వద్ద జరిగిన వేడుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యతకు చిహ్నంగా నిర్మించిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించిన ప్రధాని… ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు సాగిస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదన్నారు. పుల్వామా దాడి సమయంలో కొందరు సైనికుల పక్షాన నిలవకపోవడం బాధించిందన్న ఆయన.. దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి రాజకీయాలు మరోసారి చేయవద్దని ఆయన అభ్యర్థించారు.
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న ప్రధాని.. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించి, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారత్ లో పర్యాటక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి కొత్త రూపు తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు. దేశం కరోనాపై విజయసాధించేందుకు కృషిచేసిన పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితర కరోనా యోధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH Live from Kevadia, Gujarat: PM Modi at Statue of Unity on birth anniversary of Sardar Vallabhbhai Patel (source: DD) https://t.co/dIvvuo4LmU
— ANI (@ANI) October 31, 2020




