ఏపీ సీఎంకు..పీఎం బర్త్ డే విషెస్

కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు పనికట్టుకోని మరీ మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. మోదీ కూడా ఏపీ పర్యటన సమయంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ […]

ఏపీ సీఎంకు..పీఎం బర్త్ డే విషెస్
Follow us

|

Updated on: Apr 20, 2019 | 9:14 AM

కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు పనికట్టుకోని మరీ మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. మోదీ కూడా ఏపీ పర్యటన సమయంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబునాయుడుకు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, ఎక్కువ కాలం జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.