అద్వానీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : ప్రధాని మోదీ

ఏప్రిల్ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కీలక సందేశం ఇచ్చారు. మొదట దేశానికే పెద్ద పీట, ఆ తర్వాతే పార్టీ.. వ్యక్తిగత అంశాలకు చివరి ప్రాధాన్యమని తన బ్లాగ్‌లో తెలిపారు. ఈ మేరకు కార్యకర్తలకు లేఖ రాశారు. బీజేపీ కార్యకర్తల ప్రేమాభిమానాలు తనను రుణపడేలా చేశాయన్నారు అద్వానీ. గతాన్ని పరిశీలిస్తూ, భవిష్యత్తులోకి తొంగి చూస్తూ, ఆత్మావలోకనం చేసుకునేందుకు ఇది మంచి సమయం అని సూచించారు. 1991 […]

అద్వానీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : ప్రధాని మోదీ
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2019 | 6:47 PM

ఏప్రిల్ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కీలక సందేశం ఇచ్చారు. మొదట దేశానికే పెద్ద పీట, ఆ తర్వాతే పార్టీ.. వ్యక్తిగత అంశాలకు చివరి ప్రాధాన్యమని తన బ్లాగ్‌లో తెలిపారు. ఈ మేరకు కార్యకర్తలకు లేఖ రాశారు. బీజేపీ కార్యకర్తల ప్రేమాభిమానాలు తనను రుణపడేలా చేశాయన్నారు అద్వానీ. గతాన్ని పరిశీలిస్తూ, భవిష్యత్తులోకి తొంగి చూస్తూ, ఆత్మావలోకనం చేసుకునేందుకు ఇది మంచి సమయం అని సూచించారు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించిన గాంధీనగర్ ప్రజలకు ఈ సందర్భంగా అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. వారు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని.. అవి తనపై ఎప్పటికీ ఉంటాయని అద్వానీ అన్నారు.

అద్వానీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. అద్వానీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యక్తులు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీని బలోపేతం చేయడంలో అద్వానీ పాత్ర కీలకం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలనే అద్వానీ బ్లాగ్‌లో పెట్టారంటూ మోదీ కొనియాడారు.

మరోవైపు అద్వానీకి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇచ్చారు. అద్వానీకి 75 సంవత్సరాలు నిండిన కారణంగానే టిక్కెట్ ఇవ్వలేదన్నారు. మురళీ మనోహర్ జోషికి కూడా ఇదే వర్తించిందన్నారు. ఇక తాను ప్రత్యక్షంగా ప్రజల ద్వారా ఎన్నికై పార్లమెంట్‌లో అడుగు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు.