AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్ : ఏపీ సీఎస్ పునేఠపై బదిలీ వేటు

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. కొత్త సీఎస్‌గా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పునేఠాను ఎన్నికలతో సంబంధంలేని పోస్టులో నియమించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీల విషయంలో సీఎస్‌ పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం […]

బిగ్ బ్రేకింగ్ :  ఏపీ సీఎస్ పునేఠపై బదిలీ వేటు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 05, 2019 | 8:56 PM

Share

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. కొత్త సీఎస్‌గా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పునేఠాను ఎన్నికలతో సంబంధంలేని పోస్టులో నియమించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.

ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీల విషయంలో సీఎస్‌ పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించింది. ఐపీఎస్‌ల బదిలీ అంశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటవెంటనే జారీచేసిన మూడు జీవోల విషయమై ఎన్నికల సంఘం వివరణను కోరింది. అనంతరం ఐపీఎస్‌ అధికారుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంటున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ కేసులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవని, ఆయన ఎన్నికల విధుల్లో లేరని జీవోలో పేర్కొన్నారు. వీటిపై పునేఠా నుంచి వివరణ కోరిన ఈసీఐ ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా