15న రాజధాని గ్రామాలకు జనసేనాని

|

Feb 08, 2020 | 5:35 PM

అమరావతి రాజధాని ఏరియా గ్రామాల్లో పర్యటించేందుకు పవన్ కల్యాణ్ ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 15న అమరావతి ఏరియా గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. అంతకు ముందు ఫిబ్రవరి 12, 13 తేదీలలో ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 15 వ తేదీన రాజధాని అమరావతి గ్రామాలలో జరిపే పర్యటనకు సంబంధించిన ప్రణాళికను జనసేన నాయకులు సిద్ధం చేశారు. ఎక్కువమంది ప్రజలను కలిసేలా ఈ […]

15న రాజధాని గ్రామాలకు జనసేనాని
Follow us on

అమరావతి రాజధాని ఏరియా గ్రామాల్లో పర్యటించేందుకు పవన్ కల్యాణ్ ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 15న అమరావతి ఏరియా గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. అంతకు ముందు ఫిబ్రవరి 12, 13 తేదీలలో ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 15 వ తేదీన రాజధాని అమరావతి గ్రామాలలో జరిపే పర్యటనకు సంబంధించిన ప్రణాళికను జనసేన నాయకులు సిద్ధం చేశారు. ఎక్కువమంది ప్రజలను కలిసేలా ఈ పర్యటన ప్రణాళికను రూపొందించాలని పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు అందుకు అనుగుణంగా స్థానిక జనసేన నాయకత్వం ఏర్పాట్లను చేస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం గత కొద్ది రోజులుగా రాజధాని వాసులు ఎదురు చూస్తున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా గాయపడిన వారు పవన్ కళ్యాణ్ కలిసి మరోసారి అమరావతి గ్రామాలలో పర్యటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వారికిచ్చిన మాట ప్రకారం ఈ పర్యటన ఖరారైంది.

అయితే అంతకు ముందు ఫిబ్రవరి 12, 13 తేదీలలో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారని జనసేన వెల్లడించింది. అయితే.. బీజేపీతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తామన్న పవన్ కల్యాణ్ ఇలా ఒంటరిగా ముందుకు వెళుతుండడంపై చర్చ మొదలైంది.