AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan deadline: బీజేపీతో బ్రేకప్‌కు డెడ్‌లైన్.. స్పెషల్ డే మార్చి 13

బీజేపీతో స్నేహం మొన్ననే చిగురించినా.. అప్పుడే బ్రేకప్ దిశగా అడుగులు వేస్తోంది జనసేన పార్టీ. మోదీతోపాటు బీజేపీ జాతీయ నేతలతో జగన్ దోస్తీగా మెలగడంపై పవన్ కల్యాణ్ గుర్రుగా వున్నారని సమాచారం. బీజేపీ, వైసీపీ కలిసినట్లుగా తేలితే విడిపోవడం ఖాయమని ఆయన ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా ఆయన మరో డెడ్‌లైన్ పెట్టుకున్నట్లు సమాచారం.

Pawan Kalyan deadline: బీజేపీతో బ్రేకప్‌కు డెడ్‌లైన్.. స్పెషల్ డే మార్చి 13
Rajesh Sharma
|

Updated on: Feb 26, 2020 | 6:40 PM

Share

Janasena cheif Pawan Kalyan’s new deadline for break-up with BJP: బీజేపీతో బ్రేకప్‌కు పవన్ కల్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారా? పరిశీలిస్తే అదే కనిపిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొన్నీమధ్యే జత కట్టారు కదా.. అప్పుడే బ్రేకప్ ఏంటనిపిస్తున్నా జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంతేనంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ మధ్య బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపించడంతో పవన్ కల్యాణ్ బీజేపీకి దూరమవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: తాగునీటి కొరత నివారణకు కొత్త ప్లాన్

ఆయన దోస్తీ కట్టారు. కానీ అప్పుడే ఝలక్ పడింది. తన రాజకీయ ప్రత్యర్థి కొత్త సిగ్నల్స్‌ పంపారు. దీంతో ఇప్పుడు ఆ సేనాని డైలామాలో పడ్డారు. తన దారెటు? అనేది తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు ఓ అవకాశం వచ్చింది. ఆ టెస్ట్‌ పూర్తయితే ఏదో ఒక నిర్ణయం తీసుకునే పనిలో ఆయన పడ్డారట. ఇంతకీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు ఎదురైన పరీక్ష ఏంటి ? ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

ఇదీ చదవండి: జీవో 107పై మడతపేచీ.. రేపట్నించి టీడీపీ ప్లాన్ ఇదే

ఏపీ రాజకీయాల్లో బీజేపీకి జనసేన దగ్గరైంది. కలిసి ఉమ్మడి కార్యాచరణ ముందుకు వెళుతోంది. కలిసి పోరాటాలు చేద్దామని అనుకునే టైమ్‌లో…పవన్‌కు ఓ స్పీడ్‌ బ్రేకర్‌ వచ్చి పడింది. అదే జగన్‌,బీజేపీ దోస్తీ. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్‌ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. ప్రధాని గంటన్నరకు పైగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరుతుందని ప్రచారం జరిగింది. కేబినెట్‌లో చేరాలని ప్రధాని జగన్‌ను ఆహ్వానించారని టాక్‌ పుట్టుకొచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇటు జగన్‌,బీజేపీ బంధంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా రియాక్ట్‌ అయ్యారు. జగన్‌తో బీజేపీ కలిస్తే..తాను దూరమవుతానని చెప్పారు.

ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్

ఇప్పుడు పవన్‌ బీజేపీతో కలిసి ఉంటారా? లేదా అనేందుకు తాజా డెడ్‌లైన్‌ మార్చి 13 అని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సీట్లకు నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ మార్చి 13. నాలుగు సీట్లలో ఒక సీటు బీజేపీకి జగన్‌ ఇస్తారని తెలుస్తోంది. ఆ ఒక సీటుకు బీజేపీ తరపున నామినేషన్‌ పడితే…అదే రోజు కమలంతో దోస్తీకి పవన్‌ కటీఫ్‌ చెబుతారని సమాచారం. దీంతో ఇప్పుడు బీజేపీ,జనసేన బంధానికి మార్చి 13 డెడ్‌లైన్‌గా చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు బీజేపీకి జగన్‌ రాజ్యసభ సీటు ఇస్తారా? ఆ సీటు ఇచ్చిన వెంటనే పవన్‌ దోస్తీకి కటీఫ్‌ చెబుతారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?