రేవంత్ ​రెడ్డికి జనసేనాని ఫోన్!

రేవంత్ ​రెడ్డికి జనసేనాని ఫోన్!
Revanth Reddy's True Opinion On Pawan Kalyan

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలోపాల్గొనాలని ఆహ్వానించారు. పవన్‌ ఆహ్వానానికి రేవంత్‌ అంగీకరించారు. వీహెచ్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు, మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్న సంగతి […]

Ram Naramaneni

|

Sep 15, 2019 | 1:30 AM

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలోపాల్గొనాలని ఆహ్వానించారు. పవన్‌ ఆహ్వానానికి రేవంత్‌ అంగీకరించారు. వీహెచ్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు, మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వీహెచ్‌ పవన్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు (వీహెచ్) నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. యురేనియం తవ్వకాల అంశంపై వీహెచ్ సోమవారం జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. పవన్ సానుకూలంగా స్పందించారు.

యురేనియం తవ్వకాలతో క్యాన్సర్‌, మూత్రపిండ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కృష్ణా జలాలు కలుషితమవుతాయని.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రముఖుల స్పందన:

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్‌ స్వరం వినిపించగా.. నటుడు విజయ్ దేవరకొండ కూడా స్వరం కలిపారు. తాజాగా సినీ నటి సమంత నల్లమల యురేనియం తవ్వకాలపై స్పందించారు. నల్లమల అడవులను యురేనియం బారి నుంచి కాపాడాలని ఛేంజ్.ఆర్గ్‌లో మొదలైన ఆన్‌లైన్ పిటిషన్‌ను సమంత షేర్ చేశారు. ఈ పిటీషన్‌పై సంతకం చేశాను. మరి మీరు? అని ఆమె ట్వీట్ చేశారు.

20,500 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు టైగర్ రిజర్వ్‌‌ను దెబ్బతీస్తుందని.. జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ పిటిషన్‌పై ఇప్పటికే 10 వేల మందికిపైగా సంతకాలు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ అడవుల్లో కొద్ది రోజుల క్రితం కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెజిల్‌లోని చాలా వరకు అడవిని దహించి వేసింది. వేలాదిగా వన్యప్రాణులను పొట్టన బెట్టుకుంది. భూ గ్రహంపై వెలువడే మొత్తం ఆక్సిజన్‌లో 20 శాతం ఈ అమెజాన్ అడవుల నుంచే ఉత్పత్తి అవుతుండటంతో ఇది అగ్నికి ఆహుతవుతుండంపై అంతా ఆందోళన వ్యక్తం చేశారు. మన సినిమా వాళ్లు వరసపెట్టి ట్వీట్లు చేశారు. ఎక్కడో ఉన్న అమెజాన్ గురించి బాధపడ్డాం. మనం ఏం చేస్తున్నాం మరి. మన ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నల్లమల’’ అని అంటూ ట్వీట్లు చేస్తున్నారు మన తెలుగు సినీ ప్రముఖులు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu