అంతా ఫేక్..సీఎంకు ఎవరూ లేఖ రాయలేదు: ప్రకాశం జిల్లా జేసీ

అంతా ఫేక్..సీఎంకు ఎవరూ లేఖ రాయలేదు: ప్రకాశం జిల్లా జేసీ

తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వెంటనే పూర్తి వివరాలు కనుక్కుని సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తమతో ఎవరూ […]

Ram Naramaneni

|

Sep 15, 2019 | 1:02 AM

తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వెంటనే పూర్తి వివరాలు కనుక్కుని సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.

తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తమతో ఎవరూ మాట్లాడటం లేదని పుష్ప లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో బడిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి విషయం గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి వివరాలు కనుక్కొని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

అధికారులు రామచంద్రాపురం గ్రామంలో పర్యటించి…గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గ్రామంలోని ప్రజలు అందరూ హాజరు అయ్యారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు గ్రామ బహిష్కరణతో పాటు.. పిల్లలను స్కూల్ కి పంపని విషయంపై విచారణ నిర్వహించారు. మెజారిటీ ప్రజలు తమ పిల్లలను స్కూల్ కి పంపుతున్నామని జాయింట్ కలెక్టర్ కి తెలిపారు. కొందరు మాత్రం మొదట రెండు రోజులు పిల్లలను స్కూల్ కి పంపని విషయం వాస్తవమేనని.. ప్రస్తుతం మాత్రం పంపిస్తున్నామని తెలిపారు. మరోవైపు.. సీఎంకు లేఖ రాసిన కుటుంబంపై వారి వ్యతిరేక వర్గం అధికారులకు ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా విచారణలో పాల్గొని గ్రామంలోని పరిస్థితిని అధికారులకు తెలిపారు. అందరినుంచి వివరాలు సేకరించిన జాయింట్ కలెక్టర్ షన్మోహన్ మీడియాతో మాట్లాడారు. గ్రామంలో ప్రధానంగా నాలుగు సమస్యలను గుర్తించాము. తీర ప్రాంతంలో గ్రామానికి చెందిన నాలుగు ఏకరాల భూమి కి సంబంధించి మాజీ ఎంపీటీసీ కోడూరి వెంకటేశ్వర్లు పట్టా పొందారు. ఆ పట్టా రద్దు చేసి గ్రామానికి అప్పగించడం జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కి కోడూరి పుష్ప రాసిన లేఖ విషయమై పూర్తిగా విచారించాము. ఆ లేఖ ఆ పాప రాయలేదని నిర్దారణ అయ్యింది. నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఈ లేఖ రాసినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన బాలిక కోడూరి పుష్ప గానీ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం జాయింట్ కలెక్టర్ గ్రామంలో పర్యటించిన సమయంలో గ్రామంలో లేరు. కులబహిష్కరణపై ఏర్పాటు చేసున విచారణ సభకు కూడా వారు ఎవ్వరూ హాజరుకాలేదు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ షన్మోహన్ సైతం మీడియాతో విచారణకు బాధిత కుటుంబం రాలేదని, గ్రామస్థులతో మాట్లాడామని తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu